E-Paper
Advertisement

Hyderabad Crime: వెంటాడిన భర్త అప్పులు.. దొంగ మారిన టెక్కీ, కెమెరాకు చిక్కింది

Hyderabad Crime: వెంటాడిన భర్త అప్పులు.. దొంగ మారిన టెక్కీ, కెమెరాకు చిక్కింది
Advertisement

Hyderabad Crime: కొందరు ఉద్యోగాలు చేస్తున్నా రకరకాల కారణాలు వెంటాడుతాయి. వస్తున్న జీతం చాలక, ఫ్యామిలీని పోషించుకునేందుకు అడ్డదారులు తొక్కుతారు. అలాంటి వారిలో ఈ టెక్కీ కూడా ఒకరు. భర్త చేసిన అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చేందుకు ఏకంగా దొంగగా అవతారం ఎత్తింది. ఆపై కెమెరాకు చిక్కింది.

దొంగగా మారిన టెక్కీ, కెమెరాకు చిక్కింది

Advertisement

ఇంజనీరింగ్ చదివి, ఉద్యోగం చేస్తున్నా కొందరు పరిస్థితుల బట్టి అడ్డదారులు తొక్కుతారు. కొందరు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరుకుతుంటారు. వరంగల్‌కు చెందిన అనితారెడ్డి బీటెక్‌ చదివింది. ఆ తర్వాత చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసింది. ఆ సమయంలో మేడ్చల్‌కు చెందిన రాజేష్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది.

ఈ జంటకు ఏడాది వయసున్న కూతురు ఉంది. రాజేష్.. ఓ ఫైనాన్స్‌ సంస్థలో పని చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ ఆ ఉద్యోగం మానేశాడు. ఈ క్రమంలో నాలుగైదు లక్షల వరకు అప్పు చేశాడు. అదే సమయంలో అనితా కూడా ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది.

Advertisement

వెంటాడిన భర్త తప్పులు.. చివరకు ఫ్యామిలీ కోసం

రోజూ అప్పులు ఇచ్చినవాళ్లు ఇంటికి రావడం మొదలైంది. భర్త తరచూ బాధపడుతుండడం గమనించింది. డబ్బు సంపాదించాలనే ఆలోచనతో భారీ స్కెచ్ వేసింది. మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నాచింగ్ చేయాలని పథకం వేసింది.

ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం మియాపూర్‌కు చెందిన కమల్‌ అనే వృద్ధురాలు అవంతి నగర్‌ తోట కాలనీలో తన ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్‌ ఎక్కింది. లిఫ్ట్‌ తలుపులు మూసుకోక ముందే కాపు కాసిన అనితా ఆ వృద్ధురాలు మెడలో మంగళ సూత్రం, నల్ల పూసల గొలుసు తెచ్చే ప్రయత్నం చేసింది.

ALSO READ:  భోగీ వేళ మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

అయితే బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు అనిత. చివరకు అర తులం విలువ చేసే నల్ల పూసల గొలుసు తెంచుకుని పారిపోయింది. ఈ ఘటనపై బాధితులురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు, అక్కడ సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశారు.

దాని ఆధారంగా నిందితురాలిని గుర్తించారు. ఆమె అనితా అని డిసైడ్ అయిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. విచారించిన పోలీసులకు పైవిషయాలు తెలిసి షాకయ్యారు. చదువుకుని ఇలాంటి పని చేయడానికి సిగ్గులా లేదా? అంటూ ప్రశ్నించారు. అప్పులు తీర్చేందుకు ఈ పని చేయాల్సి వచ్చిందని చెప్పినట్టు తెలిసింది. 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×