Director Shankar:ప్రముఖ డైరెక్టర్ శంకర్ (Shankar ) తాజాగా ‘లవ్ టుడే’ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ‘డ్రాగన్’ మూవీ పై ప్రశంసలు కురిపిస్తూ రివ్యూ ఇచ్చారు. అశ్వత్ మారిముత్తు (Ashwath marimuthu ) దర్శకత్వంలో అర్చనా కల్పతి(Archana kalpathi) నిర్మించిన చిత్రం డ్రాగన్. కయాదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా గత శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు తమిళ్, తెలుగు భాషలలో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్లో కలెక్షన్లు ఊపందుకున్నాయి. వీకెండ్ మొత్తంలో మంచి కలెక్షన్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటు తెలుగులో కూడా ఈ డ్రాగన్ మూవీకి కలెక్షన్స్ బాగా వస్తుండడంతో పలువురు చిత్ర సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా ద్వారా తమ స్పందన తెలియజేస్తున్నారు..
డ్రాగన్ మూవీ పై ప్రశంసలు కురిపించిన డైరెక్టర్ శంకర్..
ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా డ్రాగన్ మూవీ మీద స్పందిస్తూ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.. “డ్రాగన్ ఒక బ్యూటిఫుల్ మూవీ.. డైరెక్టర్ చాలా అద్భుతంగా రాశారు. ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అన్ని పాత్రలకి కూడా ఒక పరిపూర్ణమైన ముగింపు లభించింది. ఇందులో హీరో ప్రదీప్ రంగనాథన్ అద్భుతంగా నటించారు. మిస్కిన్, అనుపమ, జార్జ్ మర్యన్ తో పాటు అన్ని పాత్రలు గుండెలను హత్తుకున్నాయి. జెన్. జీ బ్యాచ్, మిలీనియల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మోసాలు పెరిగిన ఈ టైంలో ఇలాంటి సినిమా రావడం సమాజానికి సందేశం ఇవ్వడం , ఒక మంచి పరిణామం. ఏజీఎస్ ప్రొడక్షన్స్ కి కంగ్రాట్స్ ” అంటూ శంకర్ ట్వీట్ వేశారు. ఇక ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్న ప్రదీప్ రంగనాథన్..
ఇకపోతే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తన సినిమా చూసి రిప్లై ఇవ్వడంతో హీరో ప్రదీప్ రంగనాథన్ గాల్లో గింగిరాలు కొడుతూ.. సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. ఈ మేరకు శంకర్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. “మిమ్మల్ని చూస్తూ పెరిగాను. మీ మీద ఎనలేని ప్రేమను పెంచుకున్న ఒక ఫ్యాన్ కు ఇది నిజంగానే ఊహించని కల. ఇలా జరుగుతుందని, మీరు మా గురించి మాట్లాడతారని , అసలు కలలో కూడా ఊహించలేదు. సార్.. ధన్యవాదాలు.. ఇది ఇప్పటికీ ఇంకా నమ్మలేకపోతున్నాను. మాటల్లో నా ఫీలింగ్స్ చెప్పలేకపోతున్నాను” అంటూ సంతోషంతో ట్వీట్ కి రిప్లై ఇచ్చారు ప్రదీప్ రంగనాథన్.
డ్రాగన్ మూవీ విశేషాలు..
డ్రాగన్ మూవీకి ప్రస్తుతం తెలుగు, తమిళ్ నుంచి భారీ స్పందన లభిస్తున్న నేపథ్యంలో అటు సక్సెస్ టూర్లు అంటూ చిత్ర బృందం కూడా జోరుగా సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వారం రానున్న కొత్త సినిమాలతో కూడా డ్రాగన్ సినిమా పోటీపడేలాగా కనిపిస్తోంది. ఏది ఏమైనా లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు డ్రాగన్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారని చెప్పవచ్చు.
#DRAGON A beautiful movie. Excellent writing- hats off to @Dir_Ashwath . All characters have a beautiful and complete journey. @pradeeponelife showed us again that he’s a terrific entertainer and proved that he is a strong, soulful performer as well. @DirectorMysskin ,…
— Shankar Shanmugham (@shankarshanmugh) February 23, 2025