Sisters Killed Brother: మానవత్వం మంట గలుస్తోంది. ఆస్తుల కోసం క్రూరమైన హత్యలు జరుగుతున్నాయి. ఆస్తి ఇవ్వలేదని తల్లిదండ్రులను పిల్లలు కొట్టిన, చంపిన ఘటనలు ఎక్కడో దగ్గర మనం నిత్యం చూస్తున్నాము. చెప్పబోయే స్టోరీలో సీన్ రివర్స్. ఇక్కడ అన్నని సొంత చెల్లెళ్లు మట్టుబెట్టారు. నమ్మడానికి విచిత్రంగా ఉంది కదా? ఇది ముమ్మాటికీ నిజం. ఒక్కసారి స్టోరీపై ఓ లుక్కేద్దాం.
మంట గలిసిన మానవత్వం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఈ దారుణం జరిగింది. కేవలం ఆస్తి కోసం సొంత అన్నని చంపేశారు తోడబుట్టిన ఇద్దరు చెల్లెళ్లు. తీవ్ర గాయాలతో ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఆస్తి గొడవలు చూసిన చుట్టుపక్కలవారు ముక్కన వేలేసుకున్నారు. సొంత అన్నని చంపడానికి ఆడపిల్లలకు మనసు ఎలా వచ్చిందంటూ ఆడిపోసుకోవడం మొదలైంది.
స్టోరీలోకి వెళ్తే..
జగిత్యాల పోచమ్మవాడ ప్రాంతానికి చెందిన జంగిలి శ్రీనివాస్ ఆర్టీఏ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఆయన వయస్సు కూడా 50 పైమాటే. అయితే శ్రీనివాస్‌కు ఒక సోదరుడు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు జరిగాయి. ఎవరి కాపురం వారిదే. ఇదంతా 30 ఏళ్ల కిందటి మాట. మొదటి సోదరి వరలక్ష్మి భర్త రెండు దశాబ్దాల కిందట చనిపోయాడు. దీంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. మూడో సోదరి శారద భర్తకు దూరంగా ఉంటోంది. శ్రీనివాస్ ఇంటికి సమీపంలో ఉంటోంది.
తండ్రి బసవయ్య పేరిట 100 గజాల భూమి ఉంది. దాన్ని కొడుకు శ్రీనివాస్‌కు ఇస్తానని దశాబ్ద కిందట చెప్పాడు. ఆ భూమి తమకు ఇవ్వాలంటూ కూతుళ్లు వరలక్ష్మి, శారద చీటికి మాటికీ గొడవ పడేవారు. చివరకు ఈ వ్యవహారం న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. పరిస్థితి గమనించిన శ్రీనివాస్, తాను తల్లిదండ్రుల వద్ద ఉండడంతో గొడవలు జరుగుతున్నాయని భావించాడు.
ALSO READ: మీరు మనుషులేనా అనిపించే ఘటన
చివరకు పేరెంట్స్ కి దూరంగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే ఆదివారం ఉదయం శ్రీనివాస్ తల్లిదండ్రులను చూసేందుకు పోచమ్మవాడ ఇంటికి వచ్చాడు. అక్కడే ఉన్న ఇద్దరు చెల్లెళ్లు.. శ్రీనివాస్‌ని రెచ్చగొట్టారు. ఇరువురు మధ్య మాటలు ముదిరాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది. జరుగుతున్న గొడవను తండ్రి బసవయ్య చూస్తూ ఉండిపోయాడు.
వయస్సుపైబడడంతో పిల్లలను ఆపలేని పరిస్థితి ఆయనది. జరుగుతున్న తతంగాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నాడు కన్నతండ్రి. పట్టరాని కోపంతో రగలిపోయారు ఇద్దరు చెల్లెళ్లు. వరలక్ష్మి, శారదలు తన తండ్రి చేతిలోని కర్ర తీసుకుని అన్న శ్రీనివాస్‌పై గట్టిగా మోదారు. వెంటనే కింద పడిపోయాడు.
కసాయి చెల్లెళ్లు
స్పృహ కోల్పోయిన శ్రీనివాస్‌ను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాస మృతి చెందినట్లు డాక్టర్ చెప్పారు. తన మరదళ్లు వరలక్ష్మి, శారద కొట్టడం వల్లే తన భర్త మృతి చెందాడని శ్రీనివాస్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తన భర్త శవాన్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యింది ఆ ఇల్లాలు. ఇప్పుడు తనకు దిక్కెవరు? కేవలం 100 గజాల స్థలం కోసం చెల్లెళ్లు రాక్షసులుగా మారారని ఆవేదన వ్యక్తం చేసింది.
దారుణం: ఆస్తి కోసం అన్నను చంపిన చెల్లెళ్లు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో ఘటన
జంగిలి శ్రీనివాస్ అనే వ్యక్తిపై కర్రలతో దాడి చేసిన ఇద్దరు చెల్లెళ్లు శారద, వరలక్ష్మి
ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి
పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఇద్దరు… pic.twitter.com/NgsIbNf2vD
— BIG TV Breaking News (@bigtvtelugu) February 23, 2025