BigTV English

Chiranjeevi: నేనూ ఓటీటీకి సిద్ధం.. ఆయనే నా రోల్ మోడల్.. గట్టి పోటీ ఇస్తానంటున్న చిరు!

Chiranjeevi: నేనూ ఓటీటీకి సిద్ధం.. ఆయనే నా రోల్ మోడల్.. గట్టి పోటీ ఇస్తానంటున్న చిరు!

Chiranjeevi:కరోనా వచ్చినప్పటి నుంచి ఓటీటీల హవా బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎంత పెద్ద సినిమా అయినా సరే థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకే ఇటు ఓటీటీలో దర్శనమిస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఇక అందుకే చాలామంది సినిమాలలోనే కాదు ఓటీటీలలో కూడా నేరుగా నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ , అమెజాన్, ఆహా వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ నేరుగా సినిమాలను రూపొందిస్తూ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాను కూడా ఓటీటీలో సినిమా చేయడానికి సిద్ధం అంటూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తెలిపారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


ఓటీటీకి సిద్ధం అంటున్న మెగాస్టార్ చిరంజీవి..

అసలు విషయంలోకి వెళ్తే.. శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో నాగార్జున(Nagarjuna ), ధనుష్ (Dhanush) కాంబినేషన్లో వచ్చిన చిత్రం కుబేర. జూన్ 20న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం థాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి తన మనసులో కోరికలను ఒక్కొక్కటిగా బయటపెట్టారు. అందులో భాగంగానే తాను కూడా ఓటీటీలో నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి మెగాస్టార్ చిరంజీవి కోరికను ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెరవేరుస్తుందో చూడాలి.


ఆయనే నాకు రోల్ మోడల్ – చిరంజీవి

ఇకపోతే ఇదే ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. నాగార్జున తనకు రోల్ మోడల్ అంటూ తెలిపారు.” నాగార్జున నాకు ఎన్నో విషయాలలో ఇన్స్పిరేషన్. అందం, ఆరోగ్యం, మనస్తత్వం, స్థితప్రజ్ఞత ఇలా ఎన్నో విషయాలలో ఆయనే నాకు రోల్ మోడల్ . నాగ్ లాగా నేను కూడా కుబేరా లాంటి సినిమాలు చేస్తానేమో.. ఈ మూవీలో ఆయన నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది” అంటూ చిరంజీవి తెలిపారు.

నాగ్ కి గట్టి పోటీ ఇస్తా – చిరంజీవి

చిరంజీవి నాగార్జునను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ..” కుబేర సినిమాలో మీకు ఒక మంచి పాత్ర పడింది. ఈ పాత్ర మీకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తుంది. మీ పరంపర కొనసాగడానికి మళ్లీ కొత్త డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇక నేను కూడా మీరు చేస్తున్న పాత్రలే చేస్తాను. మీకు పోటీగా మీ దారిలోనే నడుస్తూ గట్టి పోటీ ఇస్తాను” అంటూ నాగార్జునతో కామెంట్లు చేశారు చిరంజీవి. మొత్తానికైతే చిరంజీవి చేసిన కామెంట్లకు హీరోలంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి మొగ్గు చూపుతున్నారే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

చిరంజీవి సినిమాలు..

ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాను విడుదలకు ఉంచగా.. మరొకవైపు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తన 157వ చిత్రం షూటింగ్లో బిజీగా పాల్గొంటున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.

also read:Trisha -Vijay: ఓకే ఇంట్లో అడ్డంగా దొరికిపోయిన త్రిష – విజయ్.. ఇంతకంటే ప్రూఫ్ కావాలా?

Related News

Mass Jathara Teaser : మాస్ జాతర టీజర్ రిలీజ్.. ఈ సారి చాలా వైల్డ్‌గానే రియాక్ట్ అయ్యాడు

Upasana Konidela : రామ్ చరణ్ తో పెళ్లికి ముందే డేటింగ్.. సీక్రెట్ రీవిల్ చేసిన ఉపాసన…

NTR vs Balayya : బాబాయ్ పక్కన లేడా ? సక్సెస్ తర్వాత తారక్ రాగం మారిందా ?

Upasana: క్లీంకారా డైలీ ఫుడ్ అదే.. లేకుంటే అంతే సంగతి అంటూ!

Coolie Movie : రిలీజ్ కు ముందే ‘కూలీ ‘ హిట్.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే..?

Comedian : చీపురుతో కొట్టిన భార్య… అవమానంతో సూసైడ్ చేసుకున్న స్టార్ కమెడియన్

Big Stories

×