BigTV English

Lucknow News: చిక్కిన విదేశీ మహిళలు.. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత అదుపులోకి, ఇంతకీ ఎవరు వీళ్లు?

Lucknow News: చిక్కిన విదేశీ మహిళలు.. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత అదుపులోకి,  ఇంతకీ ఎవరు వీళ్లు?

Lucknow News: యూపీ రాజధాని లక్నోలో ఇద్దరు మహిళలు పోలీసులకు చిక్కారు. వారిద్దరి ఇటీవల తమ ముఖం గుర్తు పట్టకుండా ఉండేలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. వారు ఉజ్బెకిస్తాన్‌ గూఢచారులా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. దీంతో నిఘా వర్గాలు ఆ మహిళలు ఎవరన్నది అనే కోణంలో లోతుగా విచారణ మొదలుపెట్టారు.


ఆదివారం లక్నోలో ఇద్దరు ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఇద్దరు యువతులను పోలీసులు అరెస్టు చేశారు. అయినా వారు తమ పోలికలు గుర్తు పట్టకుండా ఉండేలా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం వారికి ఎందుకు వచ్చింది? ఇంతకీవారెవరు? వీసా గడువు ముగిసినా ఎందుకు భారత్‌లో ఉండటానికి కారణాలేంటి? ఏమైనా సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తున్నారా?

ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.  ఉజ్బెకిస్తాన్‌కు చెందిన హోలిడా, నీలోఫర్ లక్నోలో అక్రమంగా ఉంటున్నారు. వారి వద్ద పాస్‌పోర్టు, వీసా లేవు. అంతకుముందు వీరిద్దరు ఢిల్లీలో ఉండేవారు. అక్కడి నుంచి లక్నోకు మకాం మార్చారు. రెండేళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు. ఆ సమయంలో ప్లాస్టిక్ సర్జరీకి ప్లాన్ చేశారు.


వీరి వెనుక ఎవరున్నారు? అనేదానిపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఆ ఇద్దరు మహిళలు ఎప్పటి నుంచి ఇండియాలో ఉన్నారు? లక్నో పోలీసులు కూడా లోతుగా దర్యాప్తులో నిమగ్నమయ్యారు. గూఢచర్యం ఏమైనా చేస్తున్నారా? అనే కోణంలో దృష్టిపెట్టారు. నిఘా సంస్థలు సైతం ఆ మహిళలను విచారణ చేస్తున్నాయి.

ALSO READ: దారుణ విషాదం.. హాట్ ఎయిర్ బెలూన్ కూలి గాల్లోనే 8 మంది మృతి

సుశాంత్ గోల్ఫ్ సిటీలోని ఒమాక్స్ ప్రాంతంలోని సిటీలోని ఒక ఫ్లాట్‌లో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. లక్నోలో డాక్టర్ వివేక్ గుప్తా క్లినిక్‌లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. త్రిజిన్ రాజ్ అలియాస్ అర్జున్ రాణా సూచనల మేరకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ వివేక్ గుప్తా, త్రిజిన్ రాజ్ లపై విదేశీయుల చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయి.

ఈ మహిళలకు బస ఏర్పాట్లు చేసిన ముఠా నాయకుడిపై ఉజ్బెకిస్తాన్‌లో లుకౌట్ నోటీసు జారీ అయ్యింది. మనుషుల అక్రమ రవాణా కింద కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఫలానా ప్రాంతంలో ఇద్దరు విదేశీ యువతులు ఉన్నట్లు లక్నోలోని విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం సమాచారం అందింది. వెంటనే పోలీసులు సాయంతో వారిని అరెస్టు చేశారు.

అక్రమంగా ఉంటున్న ఉజ్బెక్ మహిళలను చట్ట విరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని ఆ కార్యాలయానికి సమాచారం వచ్చింది. డాక్టర్ వివేక్ ఇప్పటివరకు ఎంతమంది విదేశీ మహిళలకు ప్లాస్టిక్ సర్జరీ చేశాడు? ముఖాల్లో ఎలాంటి మార్పులు చేశాడు? అనేదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. విదేశీ మహిళలుగా కనిపించకుండా ఉండేలా సర్జరీ చేయించుకున్నట్లు చెబుతున్నారు ఆ మహిళలు.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×