E-Paper
Advertisement

TG Cybersecurity Operation: చైల్డ్ పోర్న్‌పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్.. రంగంలోకి 18 టీమ్స్

TG Cybersecurity Operation: చైల్డ్ పోర్న్‌పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్.. రంగంలోకి 18 టీమ్స్
Advertisement

TG Cybersecurity Operation: తెలంగాణలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగింది. 18 ప్రత్యేక బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు నిర్వహించి, వివిధ సైబర్ నేరాలతో సంబంధం ఉన్న 24 మంది నిందితులను అరెస్ట్ చేశాయి. ఈ ఆపరేషన్ ప్రధానంగా చిన్నారులపై జరుగుతున్న అశ్లీల వేధింపులు, కోట్ల రూపాయల ఆర్థిక మోసాలకు సహకరిస్తున్న నెట్‌వర్క్‌లను ఛేదించడంపై దృష్టి సారించింది. అరెస్టయిన వారిలో పాత నేరస్థులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం.

ఇద్దరి చిన్నారులపై అఘాయిత్యాలు..
ఈ ఆపరేషన్‌లో వెలుగు చూసిన అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, నిందితుల వేధింపులకు గురైన వారిలో 90 శాతం మంది 4 ఏళ్ల నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న బాలికలే ఉన్నారు. చిన్నారుల అశ్లీల కంటెంట్‌ను (CSAM) సేకరించడం, నిల్వ చేయడం, ఇంటర్నెట్ వేదికగా వ్యాప్తి చేయడం వంటి దారుణాలకు వీరు పాల్పడుతున్నారు. ఒక నిందితుడు నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడుతూ దొరికిపోగా, నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈ అశ్లీల నెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

Advertisement

రూ. 26 కోట్ల భారీ దోపిడీ..
సైబర్ నేరగాళ్లు తాము దోచుకున్న సొమ్మును దారి మళ్లించేందుకు సామాన్యుల బ్యాంక్ ఖాతాలను (Mule Accounts) వాడుకుంటున్నారు. తక్కువ కమీషన్ ఆశజూపి బ్యాంక్ ఖాతాలను అద్దెకు తీసుకుంటున్న 10 మందిని పోలీసులు గుర్తించారు. వీరి ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు రూ. 26 కోట్ల మేర అక్రమ నగదు బదిలీలు జరిగినట్లు విచారణలో తేలింది. ఈ మ్యూల్ అకౌంట్ హోల్డర్లకు దేశవ్యాప్తంగా సుమారు 37 సైబర్ నేరాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉందని నిర్ధారణ అయ్యింది.

టెక్నాలజీ ఆధారంతో నిందితుల వేట..
సైబర్ పోలీసులు ఈ ఆపరేషన్ కోసం అత్యాధునిక డేటా అనలిటికల్స్, మానిటరింగ్ టూల్స్‌ను ఉపయోగించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, డార్క్ వెబ్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లలో చిన్నారుల అశ్లీల కంటెంట్‌ను షేర్ చేస్తున్న వారి ఐపీ (IP) అడ్రస్‌లను ట్రాక్ చేయడం ద్వారా నిందితులను పట్టుకున్నారు. ఆర్థిక నేరగాళ్లను పట్టుకోవడానికి ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి, నగదు ఎక్కడికి బదిలీ అవుతుందో గుర్తించి గాలం వేశారు.

Advertisement

అరెస్టయిన నిందితులపై కేవలం సైబర్ చట్టాలే కాకుండా, కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేశారు. చిన్నారుల అశ్లీల కంటెంట్‌ను కేవలం చూడటం లేదా నిల్వ చేయడం కూడా చట్టరీత్యా నేరమని పోలీసులు స్పష్టం చేశారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 67-B ప్రకారం చిన్నారుల అసభ్యకర కంటెంట్‌ను ప్రసారం చేసే వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. మ్యూల్ అకౌంట్ హోల్డర్లపై కూడా మనీ లాండరింగ్, మోసం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో 8,432 ప్రత్యేక బస్సులు

అంతేకాకుండా సైబర్ భద్రత విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. చిన్నారులకు సంబంధించిన అశ్లీల కంటెంట్ కనిపిస్తే వెంటనే cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. ఆర్థికంగా సైబర్ మోసానికి గురైన వారు లేదా అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వారు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేయాలి. ఎవరికీ తమ బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఓటీపీలు (OTP) పంచుకోవద్దని, అపరిచిత వ్యక్తులకు ఖాతాలను అద్దెకు ఇవ్వవద్దని బ్యూరో హెచ్చరించింది.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×