America Gun Fire: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి బలయ్యాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు తెలంగాణకు చెందిన వ్యక్తి. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన ప్రవీణ్. తమ కొడుకు లేడన్న వార్త తెలుసుకున్న ఆ పేరెంట్స్ కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
ప్రవీణ్ సొంతూరెక్కడ?
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి చెందిన రాఘవులు-రమాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు, కూతురు ఉన్నారు. ప్రవీణ్ వయస్సు 27 ఏళ్లు. అయితే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు ప్రవీణ్. యూనివర్సిటీలో ఎంఎస్ రెండో ఇయర్ చదువుతున్నాడు. విస్కాన్సిన్ మిల్వాంకిలో నివాసం ఉంటున్నాడు. ఖర్చుల కోసం ఓ స్టార్ హోటల్‌లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు ప్రవీణ్.
ఏం జరిగింది?
ఇక అసలు విషయానికొద్దాం. ప్రవీణ్ నివాసం ఉండే ఇంటికి సమీపంలో బీచ్ ఉంది. బుధవారం డ్యూటీ నుంచి రూమ్‌కి వస్తుండగా దుండగులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అంబులెన్స్ వచ్చేలోపు ప్రవీణ్ చనిపోయాడు. ప్రవీణ్ మరణ వార్త విన్న అతడి స్నేహితులు షాకయ్యారు.
వెంటనే ఇండియాలో అతడి కుటుంబసభ్యులకు ఘటన విషయాన్ని తెలిపారు. చెట్టుకు ఎదిగిన కొడుకు లేడన్న విషయం తెలియగానే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్ మృతితో కేశంపేట మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కొడుకు మృతదేహాన్ని ఎలాగైనా తీసుకురావాలని మొరపెట్టుకుంటున్నారు.
ALSO READ: గుంతకల్లులో పరువు హత్య
ఘటన జరిగిన తర్వాత స్థానిక పోలీసులు అలర్ట్ అయ్యారు. నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులు అక్కడ గన్ కల్చర్‌కు బలి అవుతూనే ఉన్నారు. అక్కడి వెళ్తే లైఫ్‌లో సెటిలై పోవచ్చని కోటి ఆశలతో అడుగుపెడుతున్నారు. బయట జరుగుతున్న ప్రచారానికి అక్కడి పరిస్థితులు చాలా తేడా ఉందని వెళ్లిన తర్వాత గుర్తించారు విద్యార్థులు. ఈలోగా చాలామంది ఈ లోకాన్ని విడిచిపెడుతున్న సందర్భాలు లేకపోలేదు.