BigTV English

Indian Rupee Value: ఈ దేశాల్లో మన కరెన్సీ చాలా ఖరీదు, ఒక్క రూపాయి విలువ అక్కడ ఎంత అంటే?

Indian Rupee Value: ఈ దేశాల్లో మన కరెన్సీ చాలా ఖరీదు, ఒక్క రూపాయి విలువ అక్కడ ఎంత అంటే?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి దేశానికి సొంత కరెన్సీ ఉంటుంది. ఈ కరెన్సీ విలువ ఆయా దేశాల్లోని కరెన్సీ వ్యాల్యూతో పోల్చితే ఎక్కవ, లేదంటే తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ కొనసాగుతోంది. ఒక కువైట్ దినార్ విలువ భారత కరెన్సీలో సుమారు రూ. 282. అమెరికా డాలర్, చైనా యువాన్ విలువ కూడా భిన్నంగా ఉంటుంది. అయితే, భారత కరెన్సీ వ్యాల్యూ ఎక్కువగా ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. ఇంతకీ అవేంటి? అక్కడ మన రూపీ వ్యాల్యూ ఎంత ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


మన కరెన్సీ విలువ ఎక్కువగా ఉన్న దేశాలు

⦿ సియెర్రా లియోన్


ఈ పశ్చిమ ఆఫ్రికా దేశం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొనసాగుతోంది. మన రూపాయి విలువ ఈ దేశంలో సుమారు 238 లియోన్లుగా ఉంటుంది.

⦿ ఇండోనేషియా

ఇండోనేషియా కరెన్సీని రుపియా అని పిలుస్తారు. ఇండియన్ రూపీతో పోల్చితే అక్కడి కరెన్సీ విలువ 193 రుపియాగా ఉంటుంది. ఇక ఇండోనేషియాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాలు ఈ దేశంలో ఉంటాయి. భారతీయులు ఎంతో ఇష్టపడే దేశాల్లో ఇండోనేషియా ఒకటి.

⦿ వియత్నాం

వియత్నాం కరెన్సీని డాంగ్ అని పిలుస్తారు. ఒక్క ఇండియన్ రుపీ విలువ అక్కడ సుమారు 303 డాంగ్‌ తో సమానం. ప్రపంచంలో ఇండియన్ రుపీకి ఎక్కువ విలువ ఉన్న దేశం ఇదే కావడం విశేషం.

⦿ లావోస్

ఇక లావోస్ కరెన్సీని కిప్ అని పిలుస్తారు. ఇక్కడ భారతీయ రూపాయి విలువ సుమారు రూ. 265గా ఉంటుంది. భారత రూపాయి విలువ ఎక్కువగా ఉన్న రెండో దేశం లావోస్.

⦿ పరాగ్వే

పరాగ్వే కరెన్సీని గురానీ అని పిలుస్తారు. ఇక్కడ భారత రూపాయి విలువ సుమారు 90 గురానీకి సమానంగా ఉంటుంది.

⦿ కంబోడియా

కంబోడియా కరెన్సీని రియాల్ అని పిలుస్తారు. ఇక్కడ భారతీయ రూపాయి విలువ సుమారు 49 రియాల్ కి సమానం.

⦿ శ్రీలంక

ఇక మన పొరుగు దేశం శ్రీలంకతో పోల్చితే మన రూపాయి విలువ ఎక్కువ. శ్రీలంకలోనూ కరెన్సీని రూపాయిగానే పిలుస్తారు. అక్కడ ఇండియన్ రూపీ విలువ సుమారు 3 రూపాయలుగా ఉంటుంది.

Read Also: మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఆ రోజే ఎందుకు జరుపుతారో తెలుసా?

⦿ జపాన్

ఇక అభివృద్ధి చెందిన దేశం జపాన్ కరెన్సీ విలువ భారత రూపాయి కంటే తక్కువ. జపాన్ కరెన్సీని యెన్ గా పిలుస్తారు. 1 భారత రూపాయి విలువ 1.69 జపనీస్ యెన్‌ కి సమానం.

సో, ఇండియన్స్ ఈ దేశాల్లో తక్కువ ఖర్చుతో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఇకపై మీరు విదేశీ టూర్లు ప్లాన్ చేస్తే, ఈ దేశాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది.

Read Also: మన రూపాయి అక్కడ 500తో సమానం, అలా చేస్తే జైల్లో చిప్పకూడు తినాల్సిందే!

Read Also: ఎస్కలేటర్ ఇరువైపులా సేఫ్టీ బ్రష్ లు, ఎందుకో తెలుసా?

Tags

Related News

PR to Indians: అమెరికా వేస్ట్.. ఈ 6 దేశాల్లో హాయిగా సెటిలైపోండి, వీసా ఫీజులు ఎంతంటే?

Local Train: సడెన్‌ గా ఆగిన లోకల్ రైలు.. దాని కింద ఏం ఉందా అని చూస్తే.. షాక్, అదెలా జరిగింది?

Metro Warning: కోచ్ లోపల రీల్స్ చేస్తే తోలు తీస్తాం, మెట్రో స్ట్రాంగ్ వార్నింగ్!

Jaffar Express Blast: రైళ్లే టార్గెట్ గా పేలుళ్లు, ఎగిరిపడ్డ బోగీలు, పదుల సంఖ్యలో ప్రయాణీకులు..

President Special Train: ప్రత్యేక రైల్లో మధురైకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంతకీ ఆ ట్రైన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Vande Bharat Trains: 9 వందేభారత్ రైళ్లు ప్రారంభం, తెలుగు రాష్ట్రాలకు ఎన్ని అంటే?

Vande Bharat Sleeper: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!

Dasara Special Trains: దసరా వేళ రైల్వే గుడ్ న్యూస్, ముంబై నుంచి కరీంనగర్ కు స్పెషల్ ట్రైన్!

Big Stories

×