Honour Killing: తమ కుటుంబం పరువు తీస్తుందని భావించిన కన్నతండ్రి.. సొంత కూతుర్ని హత్య చేశాడు. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడమే ఆ యువతి చేసిన తప్పు. చివరకు కూతుర్ని చంపి ఆపై తగుల బెట్టేశాడు కన్నతండ్రి. సంచలనం రేపిన ఈ ఘటన గుంతకల్లులో చోటు చేసుకుంది.
స్టోరీలోకి వెళ్తే..
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్‌లో నివాసం ఉంటున్నారు తుపాకుల రామాంజనేయులు. ఆయనకు నలుగురు కుమార్తెలు. కూతుళ్లు అంటే ఇంతా ఇంతా ప్రేమ కాదు. పిల్లలు సైతం తండ్రి చెప్పిన మాట వినేవారు. వయస్సు పెరిగింది.. పిల్లల ఆలోచనలు మారుతాయని భావించలేక పోయాడు కన్న తండ్రి.
నలుగురు కూతుళ్లలో చిన్నది భారతి. 19 ఏళ్లు కూడా.. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేది. తండ్రికి కూడా చిన్న కూతురంటే చెప్పలేనంత ఇష్టం. భారతి కొద్దిరోజులుగా ఓ యువకుడితో క్లోజ్‌గా ఉండడం మొదలైంది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. చివరకు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.
పెళ్లిని చేసుకుంటానని చెప్పడమే కారణమా?
పల్లెటూరులో అందరూ మాట్లాడుకోవడం సహజమేనని అనుకున్నాడు ఆ తండ్రి. దాని వెనుక కూతురు ప్రేమలో పడిందనే విషయాన్ని గుర్తించలేక పోయాడు. చివరకు తన ప్రేమ గురించి తండ్రి దృష్టికి తెచ్చింది భారతి. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కూతురు మాటలు విని ఒక్కసారిగా ఆ తండ్రి షాకయ్యాడు.
ALSO READ: భారీ ఎత్తున పట్టుబడిన గంజాయి
ఈ విషయంలో తండ్రిని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేసింది. అయినా వినలేదు. కూతురు అన్నంత పని చేస్తే తన పరువు పోతుందని భావించాడు. ఇక చంపాలన్న నిర్ణయానికి వచ్చేశాడు. ప్లాన్ ప్రకారం మార్చిన ఒకటిన కూతుర్ని హత్య చేశాడు తండ్రి రామాంజనేయులు. కొండ ప్రాంతంలో చంపేసి, శవంపై పెట్రోల్ పోసి తగల బెట్టాడు.
రంగంలోకి పోలీసులు
ఆ శవం సగం సగం కాలింది. రెండు రోజుల తర్వాత తన పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు తండ్రి. తన కూతుర్ని ఈ చేతులతో చంపేశానని పోలీసులకు వివరించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుడు చెప్పిన ప్రాంతానికి వెళ్లే సరికి సగం కాలిన మృత దేహం కనిపించింది. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.