Telugu Couple Killed: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలుగు దంపతులు మృతి చెందగా కొడుకు, కుమార్తెకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరికి చెందిన కొటికలపూడి కృష్ణ కిషోర్ అలియాస్ టిన్ను, ఆశ, వాషింగ్టన్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. కొడుకు, కుమార్తెకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
కృష్ణ కిశోర్ కొన్నేళ్లుగా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా వర్క్ చేస్తున్నారు. వీరి ఫ్యామిలీ 10 రోజుల క్రితం తమ స్వగ్రామం అయిన పాలకొల్లు వచ్చి తిరిగి వెళ్లారు. మార్గమధ్యలో దుబాయ్ లోని న్యూయర్ వేడుకల్లో పాల్గొని, ఆ తరువాత అమెరికా వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Also Read: అమెరికాలో తెలుగు యువతి హత్య.. మాజీ ప్రియుడే చంపేశాడా!
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.