Thief swallows diamond | బంగారం, వజ్రాల ఆభరణాలు దుకాణాల్లో తరుచూ దొంగతనాలు జరగుతూ ఉంటాయి. కానీ ఇటీవలే ఒక వజ్రాల దుకాణం నుంచి రూ.6.7 కోట్లు విలువైన వజ్రాభరణాలు చోరీ చేయబడ్డాయి. కానీ ఎంతో తెలివిగా పనికానిచ్చిన ఆ దొంగ పోలీసులు తనను పట్టుకుంటారనే భయంతో కోట్లు విలువ చేసే ఆ వజ్రాలు మింగేశాడు. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఆర్లాండో నగరంలో నివసించే జేథాన్ లారెన్స్ గిల్డర్ అనే 32 ఏళ్ల యువకుడు ఫిబ్రవరి నెలలో స్థానిక బాస్కెట్ బాల్ ప్లేయర్ టీమ్ సభ్యుడిగా వేషం వేసి టిఫానీ అండ్ కో అనే జువెలరీ స్టోర్ లోకి దర్జాగా వెళ్లాడు. లారెన్స్ ఖరీదైన వేషాధారణ చూసి జువెలరీ షాప్ లో అతడు అడిగిన ప్రీమియం డైమండ్ ఆభరణాల కలెక్షన్ చూపించారు. ఇంకేముంది.. అందరూ చూస్తూ ఉండగానే.. లారెన్స్ అక్కడి నుంచి రెండు జతల డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకొని పరుగులు తీశాడు.
ఆ రెండు డైమండ్ ఇయర్ రింగ్స్ జతల విలువ ఒకటి 4.86 కారెట్ డైమండ్ 160,000 డాలర్లు కాగా.. మరొకటి 8.10 క్యారెట్ డైమండ్ ఇయర్ రింగ్స్ దాని విలువ 6,09,500 డాలర్లు. దీంతో డైమండ్ జువెలరీ షాపు యాజమాన్యం పోలీసులను సంప్రదించింది. దీంతో లారెన్స్ ని పట్టుకనేందకు నగర పోలీసులు నడుం బిగించారు. రెండు రోజుల తరువాత నగర పరిసరాల్లో హైవే వద్ద లారెన్స్ వెళుతున్నట్లు గుర్తించి అతడిని పట్టుకున్నారు. పోలీసులు తనను పట్టుకోవడానికి వస్తున్నారని తెలిసి లారెన్స్ ఇక తప్పించుకోలేనని ఒక ప్లాన్ వేశాడు. తన వద్ద ఆ డైమండ్ ఇయర్ రింగ్స్ ఉంటేనే నేరం రుజువు అవుతుంది. అందుకే వాటిని పోలీసుల చేతికి దొరక్కుండా.. నోట్లో వేసుకొని మింగేశాడు.
Also Read: తస్మాత్ జాగ్రత్త.. కొత్త కొత్త విధానాల్లో చోరీలు చేస్తున్న దొంగలు.. ఎలాగంటే?..
పోలీసులు ఆ విషయం తెలియక.. అతడిని మొత్తం సోదా చేసినా.. ఆ వజ్రాలు లభించలేదు. దీంతో అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అతను నివసిస్తున్న గదిని కూడా సోదా చేశారు. అయినా వారికి ఆ డైమండ్స్ జాడ తెలియలేదు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ లో లారన్స్ కు కడుపు నొప్పి రావడంతో అతను తనని వదిలేయండి పోలీసులను బతిమాలాడు. తాను దొంగతనం చేయలేదని.. తన వద్ద ఎటువంటి వజ్రాలు లేవని ప్రాధేయపడ్డాడు. దీంతో పోలీసులు కూడా దాదాపు అతడిని వదిలేద్దామనుకున్నారు. కానీ లారెన్స్ తనకు తీవ్రమైన కడుపునొప్పి ఉందని వెంటనే ఆస్పత్రికి వెళ్లాని ఏడవడంతో పోలీసులకు అనుమానం కలిగింది.
లారెన్స్ ని తీసుకొని ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడ లారెన్స్ కడుపుని ఎక్స్ రే స్కాన్ చేశారు. ఆ స్కాన్ రిపోర్ట్ లో ఏదో వస్తువులు అతని కడుపులో ఉన్నట్లు వైద్యులకు కనిపించింది. దీంతో వైద్యులు ఆ రిపోర్ట్ ని పోలీసులకు చూపించారు. దీంతో పోలీసుల ముందు లారెన్స్ నాటకం బయటపడింది. సాధారణంగా అయితే కాసేపట్లో లారెన్స్ చోరి చేశాడని ఆధారం లేదు కాబట్టి అతడిని వదిలేయాల్సి వచ్చేది కానీ.. ఇప్పుడు స్కాన్ రిపోర్ట్ అతని బండారం బయట పడడంతో పోలీసులు అతని కడుపులో నుంచి ఆ వజ్రాలు తీయించే పనిలో పడ్డారు.
ఆ తరువాత ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ.. లారెన్స్ తాను వజ్రాలు మింగేసినందకు చాలా బాధపడ్డాడు. ఇంకా ఆలస్యమైతే అతని ప్రాణానికే ప్రమాదం. ఈ కేసులో లారెన్స్ తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు తనను పట్టుకోవడానికి వస్తే ఆ వజ్రాలు కారు బయట పడేసి ఉండాల్సిందన్నాడు.
లారెన్స్ నేర చరిత్ర చూస్తే.. అతను గతంలో కొలరాడో నగరంలో మొత్తం 48 దొంగతనాలు చేసినట్ల తేలింది. మరో ఆసక్తికర విషయమేమిటంటే లారెన్స్ 2022లో కూడా అదే జువెలరీ స్టోర్ నుంచి ఒక సారి దొంగతనం చేశాడు.