BigTV English

Three Transgenders Found Dead: తీవ్ర కలకలం.. హిజ్రాల 3 మృతదేహాలు లభ్యం.. ఎక్కడంటే..?

Three Transgenders Found Dead: తీవ్ర కలకలం.. హిజ్రాల 3 మృతదేహాలు లభ్యం.. ఎక్కడంటే..?

Three Transgenders Were Found Dead in Andhra Pradesh: ఏపీలో తీవ్ర కలకలం రేగింది. చెరువులో మూడు మృతదేహాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. దీంతో ఏపీలో కలకం రేగింది. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం.. అటవీ సమీపంలో ఉన్న చెరువులో మృతదేహాలు పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చెరువులో మూడు మృతదేహాలు దొరకడం మిస్టరీగా మారింది.


ఏపీలోని కర్నూలు శివారులో హిజ్రాల మృతదేహాలు తీవ్ర కలకలం సృష్టించాయి. గార్గేయపురం చెరువులో మూడు మృతదేహాలు పడి ఉండడాన్ని స్థానికులు ఆదివారం గమనించారు. చెరువులో మృతదేహాలు పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Also Read: భగ్గుమంటున్న ఆళ్లగడ్డ.. అఖిలప్రియ – సుబ్బారెడ్డిల మధ్య ఆస్తి వివాదాలు ?


విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్థలిని పరిశీలించారు. ఆధారాల కోసం పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసును త్వరితగతిన ఛేదిస్తామని చెప్పారు. హిజ్రాలు ఆత్మహత్య చేసుకున్నారా.. ? లేక ఎవరైనా హత్య చేసి మృతదేహాలను ఇక్కడ వదిలేసి వెళ్లారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు ఆ వార్తా కథనాల్లో పేర్కొన్నారు.

Tags

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×