E-Paper
Advertisement

Kukatpally: కారం కొట్టారు.. కోటి కొట్టేశారు.. పట్టపగలే దొంగల బీభత్సం, ఇదిగో వీడియో

Kukatpally: కారం కొట్టారు.. కోటి కొట్టేశారు.. పట్టపగలే దొంగల బీభత్సం, ఇదిగో వీడియో
Advertisement

Kukatpally: నగరంలో మరోసారి ‘హవాలా’ సొమ్ము కలకలం సృష్టించింది. కూకట్‌పల్లి ఏసీపీ కార్యాలయానికి అత్యంత సమీపంలోనే దుండగులు బరితెగించి భారీ దోపిడీకి పాల్పడ్డారు. బహదూర్‌పూర ప్రాంతానికి చెందిన అజాముద్దీన్, కుస్రుఫ్ అనే ఇద్దరు వ్యక్తులు దాదాపు రూ. కోటి నగదుతో బైక్‌పై జీడిమెట్ల వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జనసమ్మర్థం ఉండే ప్రాంతంలోనే ఇంతటి సాహసానికి దుండగులు ఒడిగట్టడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది.

అయితే బాధితులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పక్కా ప్లాన్‌తో వెంబడించిన అగంతకులు, నిర్మానుష్య ప్రాంతం కోసం చూడకుండా ఏకంగా పోలీస్ కార్యాలయ సమీపంలోనే వారిని అడ్డుకున్నారు. క్షణాల వ్యవధిలో అజాముద్దీన్, కుస్రుఫ్‌ల కళ్లలో కారం కొట్టి, వారిని తేరుకోనివ్వకుండా నగదు సంచిని లాక్కొని అక్కడి నుండి మెరుపు వేగంతో పరారయ్యారు. కళ్లు మండటంతో బాధితులు హాహాకారాలు చేసినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Advertisement

ఈ దోపిడీ ఉదంతంపై బాధితులు వెంటనే కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు. అయితే, పోగొట్టుకున్న సొమ్ము ‘హవాలా’ మార్గంలో తరలిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం అందడంతో పోలీసులు ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. నిందితులకు ఈ నగదు తరలింపు విషయం ముందుగానే తెలిసి ఉంటుందని, అందుకే పక్కా రెక్కీ నిర్వహించి ఈ అటాక్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: 390 కిలోల పొగాకు.. కారు ఆపమంటే కానిస్టేబుల్‌ను బోనెట్‌పై ఈడ్చుకెళ్లాడు..కట్ చేస్తే!

Advertisement

ప్రస్తుతం ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పట్టపగలే, అది కూడా పోలీస్ ఉన్నతాధికారుల కార్యాలయాల సమీపంలో ఇంతటి భారీ మొత్తాన్ని దోచుకెళ్లడం నగర భద్రతా ఏర్పాట్లపై చర్చకు దారితీసింది. ఈ నగదు మూలాలు ఎక్కడివి? ఆ వ్యక్తులు అంత డబ్బు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అనే అంశాలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×