E-Paper
Advertisement

Transgender Ruckus: ఆ హోటల్‌లో హిజ్రా రచ్చ.. బట్టలు విప్పేసి, అంతు చూస్తానంటూ రంకెలు

Transgender Ruckus: ఆ హోటల్‌లో హిజ్రా రచ్చ.. బట్టలు విప్పేసి, అంతు చూస్తానంటూ రంకెలు
Advertisement

Transgender Ruckus: మంచి ముహూర్తాలు రావడంతో హిజ్రాల అలజడి మొదలైందా? నగరాలు, జిల్లాల కేంద్రాల్లో తెల్లవారుజామున వేళ చక్కర్లు కొడుతున్నారా? ఒక్కోసారి హిజ్రాలు రెచ్చిపోతున్నారా? డబ్బుల కోసం అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నారా? బాపట్లలో జరిగిన ఘటన వెనుక అసలు ఏమి జరిగింది?

బాపట్లలోని ఓ హోటల్‌లో రెచ్చిపోయిన హిజ్రా 

Advertisement

బాపట్ల టౌన్‌లో జీపీసీ రోడ్డులో ఓ రెస్టారెంట్‌ ఉంది. శనివారం దాదాపు నాలుగు గంటల సమయంలో ఓ హిజ్రా రెస్టారెంట్‌కి వెళ్లింది. తొలుత ఓనర్‌తో మాట్లాడుతూ వీరంగం సృష్టించింది. బిర్యానీ తిన్న తర్వాత ప్లేటులో చేయి కడగొద్దన్నందుకు సప్లయర్‌పై దాడి చేసింది. తన ఒంటిపై ఉన్న బట్టలను తీసివేస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేసింది. ఆ సమయంలో టీ వచ్చినవారు హిజ్రా దూకుడు చూసి షాకయ్యారు.

చాలామంది బయటకు పరుగులు పెట్టారు. మాది హైదరాబాద్.. మీ అంతు చూస్తామంటూ రంకెలు వేస్తూ ఉల్లిపాయలు కోసే చాకుతో హడావుడి చేసింది. దాదాపు అర్థగంటపాటు జరిగింది. ఈ పరిస్థితి గమనించిన రెస్టారెంట్ యజమాని బాపట్ల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హిజ్రాపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Advertisement

బట్టలు విప్పేసి, అంతు చూస్తానంటూ రంకెలేసింది

ఉన్నట్లుండి బాపట్లలో హిజ్రా ఈ విధంగా చిందులు వేయడంపై స్థానికులు కొత్త కొత్త విషయాలు చెబుతున్నారు. ఇటీవల కాలంలో హిజ్రాల గ్యాంగ్ బాపట్ల టౌన్‌లో నానా హంగామా చేస్తున్నట్లు చెబుతున్నారు. వారితో గొడవ ఎందుకని చాలామంది సైలెంట్‌గా ఉంటున్నారని చెబుతున్నారు. వారికి నోటికి ఎంత వస్తే అంత డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

పెళ్లిళ్లు, ఇంట్లో దిగేందుకు ముహూర్తాలు లేకపోవడంతో కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్నారని అంటున్నారు. మంచి ముహూర్తాలు ఉండడంతో 15 నుంచి 20 మంది వరకు గ్రూప్‌లో పట్టణంలో సంచరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల‌కాలంలో హైదరాబాద్ సిటీలోకి ఉత్తరాధి నుంచి హిజ్రాలు గ్యాంగ్‌లు వచ్చాయి. కొత్త కొత్త ప్రాంతాల్లో వారంతా మకాం వేస్తున్నారు.

ALSO READ: అధికారి బెడ్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. కటకటాల్లోకి నిందితులు

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలకు చెందిన ట్రాన్సజెండర్స్ ఏపీలోకి ముఖ్య నగరాలు, పట్టణాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కావాల్సినంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకుండా హోటల్ ముందు చేసినట్టు రచ్చ చేస్తున్నారని వాపోతున్నారు. ఇటు హైదరాబాద్‌లో హిజ్రాలు వేకువజామున వాహనాలు వేసుకుని నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో సంచరిస్తున్నారు.  ఎవరైనా ఇంట్లోకి దిగినట్టు ఉంటే అక్కడ వాలిపోతున్నారు.

https://twitter.com/bigtvtelugu/status/2020320573646393855

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×