E-Paper
Advertisement

Nalgonda Politics: నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరు.. రెబల్స్ పై ప్రధాన పార్టీల దృష్టి !

Nalgonda Politics: నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరు.. రెబల్స్ పై ప్రధాన పార్టీల దృష్టి !
Advertisement

Nalgonda Politics: నల్గొండ, స్వేచ్ఛ: నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ ఎస్ బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరును పెంచాయి. నల్గొండ కార్పొరేషన్ సహా జిల్లాలో ఆరు మున్సిపాలిటీల పరిధిలో 162 వార్డులు ఉన్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ సాధ్యమైనంత మేరకు మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుండగా అధికార పార్టీ అభ్యర్థులను ఓడించి మున్సిపాలిటీలను కైవసం చేసుకొని సత్తా చాటేందుకు గులాబీ పార్టీ సర్వశక్తులను ఒడ్డుతోంది. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) తన హయాంలో జరిగిన అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులతో పాటు పార్టీ రెబల్స్ ను తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

Also Read: E-Rickshaw Burn: రూ.2.5 లక్షలు విలువ చేసే ఇ-రిక్షాను తగలబెట్టేసిన మహిళ.. కారణం ఇదేనట!

నల్గొండ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా

Advertisement

గెలుపు బాటకు మార్గం సుగమం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఆర్థిక, సామాజిక సమీకరణాలతో పాటు బంధు వర్గాలను రంగంలోకి దింపారు. నల్గొండ కార్పొరేషన్ పరిధిలో 45 స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకొని నల్గొండ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండాను ఎగరవేసేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మేయర్ అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన దైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, దేవరకొండలో ఎమ్మెల్యే బాలు నాయక్ ఇతర ముఖ్య నేతలతో కలిసి ప్రచారం సాగిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల పరిశీలకులను సమన్వయకర్తలను ఏర్పాటు చేసి అధికార పార్టీకి ధీటుగా ప్రచారం చేస్తోంది.

మిర్యాలగూడ మున్సిపాలిటీ లో టఫ్ ఫైట్

జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలలో విజయ అవకాశాలు అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత మెరుగుగా ఉండగా మిర్యాలగూడ లో మున్సిపాలిటీ మాత్రం అధికార పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మధ్య మున్సిపల్ పోరు టఫ్ ఫైట్ గా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో బీఆర్ఎస్, సీపీఎం పొత్తు పెట్టుకుని ప్రచారాన్ని ధీటుగా సాగిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తనదైన వ్యూహంతో ముందుకు సాగుతుండగా రెండు ప్రధాన పార్టీల నుంచి కొన్ని వార్డులు మినహా జనాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న వ్యక్తులే అభ్యర్థులుగా బరిలో ఉండటం మిర్యాలగూడలో టఫ్ ఫైట్ కు కారణంగా కనిపిస్తోంది.

Advertisement

Also Read: GHMC: బల్దియా పై సర్కార్ కీలక నిర్ణయం.. ఆస్తుల పంపకాలకు ప్రత్యేక కమిటీ!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×