Tirupati Accident: తిరుపతిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గరుడ వారధి ఫ్లైఓవర్ నుంచి ఇద్దరు యువకులు కిందపడ్డారు. సుమారు 50 అడుగుల ఎత్తు నుండి పడడంతో ఆ ఇద్దరు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఫ్లై ఓవర్ పై ఇద్దరు యువకులు వేగంగా ప్రయాణిస్తుండగా ప్రమాదవ శాత్తు.. బైక్ బలంగా గార్డ్ రైల్ ను ఢీకొట్టడంతో.. ఇద్దరు యువకులు కిందకు పడిపోయినట్లు తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇద్దరు యువకులు తిరుపతికి చెందినవారిగా తెలుస్తోంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు.. ఫ్లైఓవర్ పై సీసీకెమరాలు సేకరించి పరిశీలిస్తున్నారు పోలీసులు.
Also Read: తెల్లజుట్టుతో విసిగిపోయారా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి
తిరుపతిలో నిత్యం శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సౌకర్యం కోసం.. ఈ గరుడవారిధి నిర్మించారు. అలాంటి ప్రదేశంలో ఈ ప్రమాదం జరగడం విషాదకరం. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి.. పునరావృతం కాకుండా.. చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కొందరు యువకులు ఈ ఫ్లైఓవర్‌పై స్పీడ్‌గా బైకులు నడుపుతుంటారు. పోలీసులు నిరంతరంగా పర్యవేక్షణ జరిపి.. స్పీడ్ బ్రేకర్లు వంటివి ఏర్పాటు చేయాలి స్థానికులు చెబుతున్నారు.