MP Crime: మహిళ అంటే చాలు… ఆమె జీవించి ఉన్నా, చనిపోయినా కూడా కామాంధుల కళ్లకు వేటగానే కనిపిస్తుంది. ఈ కాలంలో స్త్రీ అంటేనే వస్తువుగా మారిపోయింది. బతికున్న మహిళలపై దాడులు, వేధింపులు, అత్యాచారాలు రోజూ వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అది నిన్నటి కాలంగా మారితే, కానీ ఇప్పుడు పరిస్థితి మరింత భయంకరంగా మారింది. శవాలపై కూడా కామం చూపించే దారుణమైన స్థాయికి మనుషులు దిగజారిపోయిందంటే మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో అర్థమవుతుంది. ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ బుర్హాన్‌పూర్ జిల్లాలో జరిగింది. ఈ ఘోర సంఘటన మనిషి రూపంలో మృగం ఎలా ఉంటుందో చూపించింది. మృతదేహం కూడా క్షేమంగా ఉండలేని ఈ భయానక ఘటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఈ అమానుష ఘటన ఎలా జరిగింది? ఎవరు చేశారు? పోలీసులు నిందితుడిని ఎలా పట్టుకున్నారు? అనే వివరాలు చూద్దాం.
ఎప్పుడు జరిగింది?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్ పూర్ జిల్లాలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. సుమారు సంవత్సరం క్రితం అంటే 2024లో జరిగిన ఘోర ఘటన తాజాగా బయటపడింది. ఖాఖ్నర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో పోస్ట్‌మార్టం కోసం తెచ్చిన మహిళ మృతదేహాన్ని ఒక వ్యక్తి శవంపై లైంగిక దాడి చేసిన వీడియో బయటకు వచ్చింది. దీంతో ఈఘటన సంచలనంగా మారింది.
Also Read: Realme 15T: యూత్‌కి కొత్త క్రేజ్..7000mAh బ్యాటరీతో రియల్‌మీ 15T 5G మొబైల్ లాంచ్
పోలీసులు ఏమన్నారంటే?
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, ఏప్రిల్ 18, 2024 ఉదయం 6.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. కానీ, అప్పటి వీడియో తాజాగా బయటకు రావడంతో అక్టోబర్ 7, 2025న డాక్టర్ ఆద్య దావర్ అనే డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈఘటన వెలుగులోకి వచ్చింది. ఈవార్త విన్న పోలీసులు షాక్ కి గురయ్యారు. వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకుని కేసు నమోదు చేశారు. అదనపు పోలీస్ అధికారి (ASP) అంతర్‌సింగ్ కనేశ్ మాట్లాడుతూ.. సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఒక వ్యక్తి స్ట్రెచర్‌పై ఉన్న మహిళా మృతదేహాన్ని లాగుతూ పోస్ట్‌మార్టం గదిలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ సిసిటీవీ దృశ్యాలు చూసిన వారంతా షాక్‌కు గురయ్యారు.
IPC సెక్షన్ 297 కింద కేసు నమోదు
వైద్యులు ఫిర్యాదు మేరకు ఖాఖ్నర్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్ 297 కింద కేసు నమోదు చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవేంద్ర పటిదార్, సబ్‌డివిజనల్ ఆఫీసర్ (పోలీస్) నిర్భయ్‌సింగ్ అలావా మార్గదర్శకత్వంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభిషేక్ జాధవ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించింది. నిందితుడు నీలేశ్ భిలాలా (25) అని గుర్తించారు. అతను భౌరాఘాట్ పరిధిలోని తంగియాపట్ గ్రామానికి చెందినవాడిగా తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అతనే ఈ ఘాతుకం చేసినట్లు పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతనిని అదుపులో తీసుకుని బుర్హాన్‌పూర్‌లోని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
పోస్ట్ మార్టం విభాగంలో ఎలా?
అయితే పోలీసులు, నిందితుడు పోస్ట్‌మార్టం విభాగంలోకి ఎలా ప్రవేశించాడు? ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరా? అతనిని ఎవరైనా ప్రోత్సహించారా? అతనితో పాటు ఇంకా ఎవరైనా ఇన్నారా? అతనికి ఆసుపత్రి సిబ్బందితో ఏమైనా సంబంధాలున్నాయా? అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బయటపడడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన మహిళలపై కూడా ఇలాంటి దారుణం జరగడం సమాజంలో ఎంత దారుణ స్థాయికి చేరిందో ఈఘటనే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆసుపత్రుల్లో భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.