Bapatla Crime: బావమరిది.. తన బావ మంచి జీవితం కోరుకుంటాడని పల్లెటూరులో అప్పుడప్పుడు చెబుతుంటారు. కొన్నిసార్లు బావమరది చేతిలో బావ హత్యకు గురైన సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి ఘటన బాపట్ల జిల్లాలో వెలుగు చూసింది. దీన్ని చాలామంది పరువుహత్యగా చెబుతున్నారు. ఈ ఘటన వెనుక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పెళ్లయిన పది రోజులకే
బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామానికి చెందిన గణేష్‌కు పెళ్లి సంబంధాలు చూశారు వారి తల్లిదండ్రులు. ఇదే సమయంలో తెనాలికి చెందిన కీర్తి అంజనీదేవితో పెళ్లిచూపులు జరిగాయి. అబ్బాయి పొట్టిగా ఉండడంతో సంబంధం వద్దనుకున్నారు యువతి తల్లిదండ్రులు. తాము వివాహం చేసుకుంటామని అబ్బాయి తరపువారు అన్నారు. అందుకు ససేమిరా అన్నారు.
తొలిచూపులో కీర్తిని ఇష్టపడ్డాడు గణేష్. చూపుల సమయంలో వారిద్దరు ఫోన్ నెంబర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత నెంబర్లు మార్చుకున్నారు. ఆ విధంగా గణేష్-కీర్తిలు మరింత దగ్గరయ్యారు. తాము వివాహం చేసుకుంటామని యువతి పెద్దల దృష్టికి తెచ్చింది. అందుకు ఏ మాత్రం అంగీకరించలేదు. దీంతో పది రోజుల కిందట ఇంటి నుంచి ఇద్దరు పారిపోయారు.
పొట్టిగా ఉన్నాడని లేపేశారు
చివరకు అమరావతిలోని ఓ దేవాయలంలో దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇంతవరకు స్టోరీ బాగానే సాగింది. సీన్ కట్ చేస్తే గణేష్-కీర్తి వ్యవహారాల్లోకి ఆమె అన్న విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. గణేష్ పొట్టిగా ఉన్నాడని భావించాడు కీర్తి సోదరుడు దుర్గారావు. ఆ తర్వాత అతడిపై ద్వేషం పెంచుకున్నాడు. తన చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని కక్ష పెంచుకున్నాడు.
ALSO READ: ఎదురెదురుగా ఢీ కొన్న బస్సులు.. స్పాట్‌లో 10 మంది
వివాహం రోజు గణేష్ అంతు చూస్తానని తొలుత వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో యువతి తన కుటుంబసభ్యులతో ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించింది. దేవాలయంలో పెళ్లి కావడంతో రిసెప్షన్ గ్రాండ్‌గా చేయాలని గణేష్ ఫ్యామిలీ డిసైడ్ అయ్యింది. ఏర్పాట్లలో గణేష్ నిమగ్నమయ్యాడు. గణేష్ బయటకు వెళ్లిన విషయం తెలుసుకున్నాడు కీర్తి బ్రదర్ దుర్గారావు.
నడిరోడ్డుపై దారి కాచి కత్తితో గణేష్‌ని పొడిచి పొడిచి చంపేశాడు దుర్గారావు. అప్పటికిగానీ దుర్గారావు పగ తీరలేదు. గణేష్ విషయం వారి ఫ్యామిలీకి తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు దుర్గారావు, అతడి స్నేహితులను అరెస్ట్ చేశారు. హత్య వెనుక అసలు కారణాలను విచారణలో బయటపెట్టాడు దుర్గారావు.
పొట్టిగా ఉన్నాడని సొంత బావను చంపిన బావమరిది..
పెళ్లి అయిన పది రోజులకే వరుడి హత్య
బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామానికి చెందిన గణేష్ కు, తెనాలికి చెందిన కీర్తి అంజనీ దేవితో పది రోజుల క్రితం వివాహం
గణేష్ పొట్టిగా ఉన్నాడని మొదట పెళ్లికి నిరాకరించిన యువతి తల్లిదండ్రులు… pic.twitter.com/njUhPVim2r
— BIG TV Breaking News (@bigtvtelugu) October 10, 2025