Sibling Abuse: ఏపీ దారుణ ఘటన చోటుచేసుకుంది. పెద్ద నాన్న కుమారుడు చెల్లి వరుసైన బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చి, మగబిడ్డకు జన్మనిచ్చింది. అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలలోని ఓ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక తల్లి గల్ఫ్ దేశంలో ఉపాధికి వెళ్లింది. తండ్రి అనారోగ్యంతో మంచానికి పరిమితం అవ్వడంతో ఇంటి దగ్గర బాలిక ఒంటరిగా ఉంటుంది.
బాలికపై కన్నేసిన పెద్దనాన్న కుమారుడు.. పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు గర్భం రావడంతో పీలేరులోని ఓ ఆసుపత్రిలో చేర్చారు బంధువులు. ఆసుపత్రిలో బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. విషయం గ్రామంలో తెలియడంతో నిందితుడు ఇంట్లోంచి పరారయ్యాడు. బాలికను తాము చూసుకుంటామని, పసిబిడ్డను ఎవరికైనా ఇచ్చేయాలని నిందితుడి కుటుంబ సభ్యులు మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.
పసిబిడ్డను ఎవరికైనా ఇచ్చేందుకు సంప్రదింపులు చేస్తుండగా, విషయం బయటకు తెలిసింది. దీంతో బంధువులు బాలికను స్వగ్రామానికి తీసుకెళ్లారు. అనంతరం జరిగిన సంఘటనపై ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మైనర్ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఆసుపత్రి నిర్వాహకులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. విషయం తెలియడంతో ఆసుపత్రి యాజమాన్యంపై ఐసీడీఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
తమిళనాడులోని ఓ ఆలయానికి వచ్చిన 13 ఏళ్ల బాలికపై పూజారి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుంభకోణం సమీపంలోని తిరువలంసుళి గ్రామంలో వెయ్యేళ్ల నాటి వినాయకుడి దేవాలయం ఉంది. ఈ ఆలయానికి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ నెల 8వ తేదీ రాత్రి ఆలయానికి ఓ కుటుంబం 13 ఏళ్ల కూతురితో ఆలయానికి వచ్చారు.
ఆలయ పూజారి విశ్వనాథన్ (75) అర్చన చేసి ప్రసాదం పెట్టారు. బాలిక ప్రసాదం తీసుకున్న హడావుడిలో తన బ్యాగును అక్కడే వదిలేసింది. హూండీలో డబ్బులు వేసే సమయంలో బ్యాగు విషయం గుర్తుకువచ్చింది. బ్యాగ్ తీసుకెళ్లేందుకు బాలిక అక్కడకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పూజారి విశ్వనాథన్ బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఏడుస్తూ వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు తెలిపింది.
Also Read: Delhi Crime News: జోద్‌పూర్‌లో ప్రేమ.. ఢిల్లీలో ముగింపు, వెనుక జరిగింది అదే?
తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని ఆలయ నిర్వాహకులకు తెలిపారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుంభకోణం పోలీసులు పూజారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.