Delhi Crime News: యువతీ యువకుల్లో ట్రెండ్ మారింది. పరిచయం చేసుకుంటున్నారు.. ఆ తర్వాత ఫ్రెండ్ షిప్ అంటున్నారు. చివరకు సహజీవనం. ఆపై హత్యలకు గురవుతున్నారు. అలాంటి ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణహత్యకు గురైంది. సంచలనం రేపిన ఈ కేసులో కొత్త విషయాలు బయటకు వచ్చాయి.
జోథ్‌పూర్‌లో పరిచయం
రాజస్థాన్‌కి చెందిన సాక్షితో హర్యానాకు చెందిన యువకుడు హిమాన్షుతో జోధ్‌పూర్ వేదికగా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రైవేటు కంపెనీలో జాబ్ నిమిత్తం సాక్షి సౌత్ ఢిల్లీకి షిఫ్ట్ అయ్యింది. ఆ తర్వాత కోట్ల ముబారక్‌పూర్ ప్రాంతంలో ఉంటోంది యువతి. మంగళవారం సాయంత్రం సాక్షి ఇంటికి హిమాన్షు వెళ్లాడు. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఆమె ఫోన్ పరిశీలించాడు.
ఆమె మరొక వ్యక్తితో ఉన్న ఫోటో చూడగానే షాకయ్యాడు. కచ్చితంగా ఆమెకు లవర్ ఉన్నాడని అనుమానం పడ్డాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రాత్రి 9 గంటల వరకు ఇద్దరి మధ్య గొడవ కంటిన్యూ అయ్యింది. మరో వ్యక్తి గురించి నిజం చెప్పకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు హిమాన్షు. తనతో తెచ్చిన కత్తితో ప్రియురాలిని కసి తీరా పొడిచి చంపేశాడు. అక్కడి నుంచి సైలెంట్‌గా జారుకున్నాడు.
ఢిల్లీ నుంచి పైలోకానికి
అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. సాక్షి ఉండే గది నుండి పెద్దగా శబ్దం రావడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మొదటి అంతస్తులోని గది ఓపెన్ చేసి చూడగా 25 ఏళ్ల యువతి రక్తపు మడుగులో పడివుంది. యువతి ముఖం, మెడ, భుజంపై కత్తిపోట్లు ఉన్నాయి. వెంటనే పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు వెల్లడించారు.
ఆమె రూమ్‌లో పోలీసులు వెతుకుతుండగా ఐడీ కార్డు కనిపించింది. యువతి పేరు సాక్షి గురుంగ్ అని తేలింది. ఢిల్లీలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెని చంపిందెవరు అనేది పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ కేసు కోసం ప్రత్యేక బృందాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలను తొలుత పరిశీలించారు. చివరకు నిందితుడ్ని గుర్తుపట్టారు. ఇంతకీ ఎక్కడ అనేదానిపై కూపీ లాగారు.
ALSO READ: పెళ్లయిన పది రోజులకే వరుడు హత్య
హిమాన్షు సొంతూరు హర్యానాకి చెందినవాడని తేలింది. చివరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ధన్‌ఖుర్థ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల నిందితుడు 10 తరగతి ఫెయిల్ కావడంతో చదువు మానేశాడు. అతడినిపై 14 క్రిమినల్ కేసులు ఉన్నాయి. హర్యానాలో ఉన్నప్పుడు గ్యాంగ్‌స్టర్ జీవనశైలి అనుసరించడం మొదలుపెట్టాడు.
వారి కోసం ఆన్‌లైన్‌లో నిత్యం వెతికేవాడని తేలింది. వారికి సంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నాలుగు నెలల కిందట సాక్షిని జోధ్‌పూర్‌లో కలిసినట్టు చెప్పాడు. ఆ తర్వాత పైన రాసిన కథంతా పోలీసుల విచారణలో బయటపెట్టాడు. అరెస్టు చేసిన పోలీసులు అతడ్ని న్యాయస్థానం హాజరుపరిచారు.