E-Paper
Advertisement

Karnataka Crime: అధికారి బెడ్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. కటకటాల్లోకి నిందితులు, ఏం జరిగింది?

Karnataka Crime: అధికారి బెడ్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. కటకటాల్లోకి నిందితులు, ఏం జరిగింది?
Advertisement

Karnataka Crime: కష్టపడటానికి ఇష్టంలేని కొందరు.. సులువుగా డబ్బులు సంపాదించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ మహిళా అధికారి బెడ్‌రూమ్‌లో కెమెరాలు పెట్టారు. ఆ తర్వాత ఆమెని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ప్లాన్ ఫెయిలై అడ్డంగా బుక్కారు ముగ్గురు నిందితులు. సంచలనం రేపిన ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.

కర్ణాటకలో దారుణం.. మహిళా అధికారి బెడ్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు

Advertisement

కర్ణాటకంలో బెళ్గావి టౌన్. ఫేక్ జర్నలిస్టుల ముసుగులో ఓ మహిళా అధికారిణి బెడ్‌రూం దృశ్యాలను సీక్రెట్ గా చిత్రీకరించారు. వాటిని ఆమెకి చూపి డబ్బులు బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలుపెట్టారు. చివరకు ముగ్గురు నిందితులను బెళ్గావి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు సమాచార హక్కు చట్టం కార్యకర్త ఉన్నాడు.

అరెస్టయి నిందితులు గోకాక్‌కు చెందిన సమీర్ నిసార్ అహ్మద్ షేక్, అబ్దుల్ రషీద్ మకందర్, మహ్మద్ బాలెకుండ్రిగా గుర్తించారు పోలీసులు. సదరు మహిళా అధికారి ఇంట్లో లేని సమయంలో ఇంటి తాళం చెవిని ఆ పక్కన పెట్టే విషయాన్ని ఇరుగుపొరుగు వారు ద్వారా తెలుసుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు. ఆ తర్వాత ఈ ముగ్గురు రహస్యంగా బల్బు హోల్డర్‌లో సీక్రెట్ కెమెరాలు అమర్చారు.

Advertisement

చిక్కిన నిందితులు, కటకటాల్లోకి ముగ్గురు, దీని వెనుక

ఆమె ప్రైవేట్‌ దృశ్యాలను చిత్రీకరించుకొని బ్లాక్‌ మెయిల్‌కు దిగారు. వాటిని చూపించి మహిళా ఉద్యోగిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు సోషల్ మీడియాలో వాటిని వైరల్‌ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. వైరల్‌ చేయకుండా ఉండాలంటే రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పదే పదే ఈ ముగ్గురి నుంచి వేధింపులు తీవ్రంకావడంతో బెళగావి పోలీస్ కమిషనర్‌ను సంప్రదించి ఈ విషయాన్ని చెప్పారు.

ప్రాథమిక దర్యాప్తులో నిందితులు ఈ ఆపరేషన్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ప్రైవేట్ ఫుటేజ్‌ రికార్డ్ చేయడానికి ఇంట్లో బల్బ్ హోల్డర్లు, ఇతర రహస్య ప్రదేశాలలో సూక్ష్మంగా ఉన్న కెమెరాలు అమర్చారు. ఫుటేజ్‌ని ఉపయోగించి బాధితురాలి నుండి భారీ మొత్తంలో డబ్బును దోచుకోవడానికి ప్రయత్నించారు. అరెస్టు, సోదాల సమయంలో ఇంటి-నిందితుల నుంచి ఫుటేజ్, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ: తిరుపతిలో దారుణం.. విజయశాంతి రెడ్డి సీన్ రిపీట్

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో శామ్‌సంగ్ అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. వివో మొబైల్ ఫోన్, 64 GB పెన్ డ్రైవ్, ఆరు స్పై కెమెరాలు, రెండు OTG పరికరాలు, మెమరీ కార్డులు, నేరానికి ఉపయోగించిన ఇన్నోవా క్రిస్టా కారుని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన మలుపు ఏమిటంటే.. మహిళా అధికారి ఇంటి పని మనిషి ప్రమేయం ఉన్నట్లు తేలింది.

నిందితుడు ఇంట్లోకి ప్రవేశించడంలో పని మనిషి కీలక పాత్ర పోషించిందని పోలీసు దర్యాప్తులో తేలింది. అధికారి కిటికీ దగ్గర తాళం చెవి ఉంచుతారని పని మనిషికి మాత్రమే తెలుసని, నిందితులకు ఆమె సమాచారం ఇచ్చినట్టు తేలింది. ఈ సమాచారాన్ని ఆసరాగా చేసుకుని ముగ్గురు వ్యక్తులు ఆమె లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి బెడ్‌రూమ్, హాలులో రహస్య కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తేలింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×