E-Paper
Advertisement

Kadapa Accident: స్టీరింగ్‌ ఊడిపడడంతో బస్సు బోల్తా.. స్పాట్‌లో 40 మంది, కడప జిల్లాలో ప్రమాదం

Kadapa Accident: స్టీరింగ్‌ ఊడిపడడంతో బస్సు బోల్తా.. స్పాట్‌లో 40 మంది,  కడప జిల్లాలో ప్రమాదం
Advertisement

Kadapa Accident: ఏపీలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కడప జిల్లాలో టూరిస్టు బస్సు బోల్తా పడింది. ఈ ఘటన సమయంలో స్పాట్ లో 40 మంది ప్రయాణికులున్నారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది?

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బస్సుల ఫిట్‌నెస్‌పై పదేపదే సందేహాలు తలెత్తుతున్నాయి. అయినా బస్సు నిర్వాహకులు వాటి గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కడప జిల్లాలో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. జమ్మలమడుగు-కన్య తీర్థం ప్రధాన రహదారిపై ట్రావెల్ బస్సు బోల్తా పడింది.

రైల్వేకోడూరు నుంచి సోమవారం ట్రావెల్ బస్సులో 40 మంది భక్తులు జమ్మలమడుగులోని కన్య తీర్థం సందర్శించారు. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అనంతపురం జిల్లా తాడిపత్రికి బయలుదేరారు. కొత్తగుంటపల్లె సమీపంలోని మలుపు వద్ద బస్సు స్టీరింగ్‌ పని చేయక ఊడిపడింది. దీంతో ఆ బస్సు బోల్తాపడింది.

Advertisement

స్టీరింగ్ ఊడిపడడంతో బస్సు బోల్తా, 10 మందికి గాయాలు

ఈ ఘటనలో రైల్వేకోడూరుకు చెందిన దాదాపు 10 మంది గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే క్షతగాత్రులను అంబులెన్సులో జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం వారిని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు.

కేవలం బస్సు ఫిట్‌నెస్ లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.  అయినా బస్సు స్టీరింగ్ ఊడిపోవడం తాము ఎక్కడా చూడలేదని అంటున్నారు. ఈ ఘటనతో ప్రైవేటు బస్సుల ఫిట్‌నెస్‌పై ఏపీలో చర్చ మొదలైంది. ప్రైవేటు బస్సులను తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ALSO READ: ఆడుకుంటూ అనంత లోకాలకు.. బాలుడి ప్రాణం తీసిన నీటి కుంట

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×