Bus Accident: కర్నూల్‌లో జరిగిన ఘోర బస్సు ప్రమాదం మరువక ముందే.. మరో ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సులో 15 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. న్యూగో ట్రావెల్ బస్సు మియాపూర్ నుంచి గుంటూరు వైపు బయల్దేరింది. బస్సులో మొత్తం 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ ORR రింగ్ రోడ్డు వద్ద వేగంగా వెళ్తుండగా.. డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడినట్లు తెలుస్తోంది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా డ్రైవర్ అతివేగంగా బస్సు నడిపినట్లు తెలుస్తోంది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండి వాహనం నడిపాడా లేక మరేదైనా కారణం ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: అన్యాయం చేశా! ఆ కుటుంబాలకు బహిరంగ క్షమాపణ.. కవిత సంచలనం
ఇదిలా ఉంటే.. ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. నెల్లూరు జిల్లా కొత్తూరు జాతీయ రహదారిపై లారీని ఓవర్ టేక్ చేయబోయి రెయిలింగ్‌ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.