E-Paper
Advertisement

Sela Lake: గడ్డకట్టిన సరస్సుపై నడక.. ఇద్దరు మృతి, కెమేరాకు చిక్కిన ఘటన

Sela Lake: గడ్డకట్టిన సరస్సుపై నడక.. ఇద్దరు మృతి, కెమేరాకు చిక్కిన ఘటన
Advertisement

గడ్డకట్టిన నదిని చూడాలనే వారి సరదా.. ప్రాణాలు మీదకు తెచ్చింది. ఏమీ కాదులే అనే నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలిగొంది. వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తావాంగ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అసలు ఏమైంది?

కేరళాకు చెందిన ఏడుగురు పర్యకులు శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో ఉన్న సెలా సరస్సు (Sela lake) చూసేందుకు వెళ్లారు. ఆ సరస్సు గడ్డకట్టి ఉండటంతో వారిని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో వారు అక్కడ సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టారు. అప్పటికీ వారి సరదా తీరలేదు.. సరస్సు మధ్య వరకు వెళ్తే ఫొటోలు ఇంకా బాగా వస్తాయని అనుకున్నారు. దీంతో ఒకరు తర్వాత ఒకరు సరస్సు మీద నడవడం మొదలుపెట్టారు. వారి బరువుకు సరస్సు మీద గడ్డకట్టిన మంచు పొర బద్దలైంది. అంతే.. ఏడుగురిలో ముగ్గురు సరస్సులో పడ్డారు. వారిలో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా ఇద్దరు గల్లంతయ్యారు. సరస్సు గడ్డకట్టి ఉండటం వల్ల వారిని వెతకడం కష్టమైంది.

ఇద్దరు మృతి..

Advertisement

ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. ఇండియన్ ఆర్మీ (సహస్త్ర సీమా బల్ – SSB), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సహాయంతో సరస్సు మొత్తం గాలించారు. శుక్రవారం సాయంత్రానికి ఒకరి మృతదేహం లభించింది. మరొకరికి ఆచూకీ తెలియరాలేదు. చనిపోయిన వ్యక్తి కేరళాలో కొల్లార్‌కు చెందిన బిను ప్రకాష్ (26)గా గుర్తించారు. గల్లంతైన మరో వ్యక్తి మహావీర్ అని తెలిసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో శుక్రవారం రాత్రి గాలింపు చర్యలు నిలిపేశారు. శనివారం ఉదయం నుంచి తిరిగి గాలింపులు కొనసాగించగా.. సరస్సులోని మరో తీరంలో రెండో వ్యక్తి మృతదేహం లభించింది.

సెలా లేక్ ప్రత్యేకత ఏమిటీ?

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈ సరస్సుకు పారడైజ్ లేక్ అనే పేరు కూడా ఉంది. సముద్ర తలానికి సుమారు 13,700 అడుగుల ఎత్తులో ఈ సరస్సు ఉంది. స్థానికలు ఈ సరస్సును దైవంగా భావిస్తారు. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అందుకే చలికాలం రాగానే ఈ ప్రాంతానికి భారీ సంఖ్యలో టూరిస్టులు తరలివస్తుంటారు. గతంలో కూడా పలువురు ఈ సరస్సులో మునిగి చనిపోయారు. దీంతో అధికారులు అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే, పర్యాటకులు అవేవీ పట్టించుకోకుండా ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.

Advertisement

Also Read: కాళ్లు, చేతులు కట్టేసి.. గొంతుకోసి, గోవాలో ఇద్దరు రష్యన్ మహిళలను చంపేసిన ఫ్రెండ్

కెమేరాకు చిక్కిన సేలా లేక్ ఘటన

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×