E-Paper
Advertisement

Warangal News: మామ-అల్లుడు కత్తులతో దాడి.. తీవ్రగాయాలు, హైదరాబాద్‌కు తరలింపు

Warangal News: మామ-అల్లుడు కత్తులతో దాడి.. తీవ్రగాయాలు, హైదరాబాద్‌కు తరలింపు
Advertisement

Warangal News: ఫ్యామిలీ సమస్యలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. అందుకు కారణాలు ఏమైనా కావచ్చు. ఫలితంగా లేనిపోని అనర్థాలకు దారి తీస్తుంది. భార్యాభర్తల గొడవల్లోకి మామ ఎంటరయ్యాడు. ఇంకెముంది.. మామ-అల్లుడు కత్తులతో దాడి చేసుకున్నారు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌కి తరలించారు సంచలనం రేపిన ఈ ఘటన వరంగల్ సిటీలో వెలుగుచూసింది.

వరంగల్‌లో మామ-అల్లుడి మధ్య కత్తులతో ఫైటింగ్

Advertisement

వరంగల్ సిటీలో గత రాత్రి మామ-అల్లుడు కత్తులతో దాడికి పాల్పడ్డారు. హనుమకొండలోని నయీంనగర్‌ ప్రాంతానికి చెందిన అనిల్‌‌రెడ్డి రామన్నపేటకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు, ఒకరు పాప, బాబు. కొంతకాలంగా భార్యాభర్తల చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి.

గొడవలు పెద్దవి కావడంతో అనిల్‌ భార్య రామన్నపేటలో తన పుట్టింటికి వెళ్లింది. మామ ప్రభాకర్.. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో గుమాస్తాగా పని చేస్తున్నాడు. కొద్దిరోజులుగా అక్కడే ఉంటోంది. మనశ్శాంతి కోసం మద్యానికి అలవాటుపడ్డారు అనిల్‌‌రెడ్డి. మద్యం పుచ్చుకుని తన మామ ఇంటికి వెళ్లాడు.

Advertisement

ఇద్దరి పరిస్థితి సీరియస్, హైదరాబాద్‌కు తరలింపు

మామ-అల్లుడు మధ్య మాటా మాటా తారస్థాయికి చేరింది.  ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా మామపై దాడి చేయబోయాడు. ఆత్మరక్షణ కోసం ప్రభాకర్ నిలువరించే ప్రయత్నం చేశాడు. అల్లుడు తీసుకొచ్చిన కత్తి కిందపడింది. దాన్ని తీసుకుని అల్లుడిపై ఎదురుదాడి చేశాడు.

ఆ తర్వాత భార్య తరఫు బంధువులపై దాడి ప్రయత్నాలు చేశాడు. మామ-అల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌‌కు తరలించారు. ఘర్షణ విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకున్నారు.

ALSO READ: డ్రగ్స్ ఓవర్ డోస్.. ఆటోలో డెడ్ బాడీస్

క్లూస్‌ టీమ్‌లను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరి పోలీసుల విచారణలో ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×