UP Crime: భార్యాభర్తల మధ్య కారణాలు ఏమైనా కావచ్చు. నాలుగు గోడల మధ్య జరగాల్సిన గొడవలు కాస్త నలుగురు మధ్యలోకి వస్తున్నాయి. ఫలితంగా కోపాలకు గురవుతున్నారు. భార్యభర్తల మధ్య గొడవలో పట్టరాని కోపంతో భార్య ముక్కు, చెంపలు కొరికేశాడు ఆమె భర్త. సంచలనం రేపిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. అసలు ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ దారుణం
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ ప్రాంతంలో గృహ వివాదం తారాస్థాయికి చేరింది. ఈ దంపతులకు వివాహం జరిగి చాలా ఏళ్లు అయ్యింది. అయినా చీటికి మాటికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. పట్టరాని కోపంతో భార్య ముక్కు, చెంపలు కొరికేశాడు. ఈ దాడిలో మహిళ ముక్కు రెండు ముక్కలైంది.
ఆమె చెంపలపై లోతుగా గాయాలు అయ్యాయి. వెంటనే బాధితురాల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె ముఖంపై సుమారు పది గాయాలకు కుట్లు వేశారు వైద్యులు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఝాన్సీలోని మెడికల్ కాలేజీకి తరలించారు. బాధిత మహిళ సోదరుడి కొన్ని కీలక విషయాలు బయటపెట్టాడు.
భార్య ముక్కు-చెంపలు కొరికేసిన భర్త, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స
దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవని తెలిపాడు. ఈ క్రమంలో గతరాత్రి ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందన్నారు. చివరకు ఈ పరిస్థితికి దారి తీసిందన్నారు. గాయం తీవ్రత దృష్ట్యా బాధిత మహిళ ముఖ సౌందర్యాన్ని ప్లాస్టిక్ సర్జరీ తప్పదనే అభిప్రాయాన్ని డాక్టర్లు వ్యక్తం చేశారు. బాధితురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఘటన తర్వాత మహిళ భర్త పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. భార్య ముఖాన్ని కొరికి గాయపరిచినట్టు తెలిపారు. ఇది ముమ్మాటికీ గృహ హింస అని చెబుతున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. బాధిత మహిళకు వైద్య పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది.
ALSO READ: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన కారు