UP Crime News: డబ్బు పాపిష్టిది.. ఏమైనా చేస్తుంది. దీనికోసం ఎంతకైనా తెగిస్తారు. తన, మన అనే బేధం ఉండదు కూడా. డబ్బు కోసం తల్లిదండ్రులను సైతం చంపేస్తున్న రోజులివి. తాజాగా అలాంటి ఘటన ఒకటి యూపీలో జరిగింది. డబ్బు వివాదం నేపథ్యంలో బాధిత మహిళలను పిలిచిన ఓ రియల్టర్, ఆమెకు బలవంతంగా మద్యం తాగించాడు. ఆ తర్వాత గొంతు కోసం చంపేశాడు. ఆమె శరీరాన్ని తగులబెట్టి నదిలో పారేశారు. సంచలనం రేపిన ఘటనకు సంబంధించి లోతుల్లోకి వెళ్దాం.
అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా మహిళలను దారుణంగా చంపేశారు ఓ రియల్టర్. ఎటావా జిల్లాకు చెందిన 28 ఏళ్ల అంజలి, భర్త చనిపోయాడు. దీంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి వద్ద ఉంటుంది. ఆ విషయాన్ని కాసేపు పక్కన బెడదాం.
అంజలి-రియల్ ఎస్టేట్ వ్యాపారి శివేంద్ర యాదవ్ మధ్య ఓ వివాదం నడుస్తోంది. భూమి కోసం అంజలి నుంచి శివేంద్ర యాదవ్ దాదాపు 6 లక్షలు తీసుకున్నాడు. డబ్బు విషయం అడిగినప్పుడల్లా అదిగో ఇదిగో అంటూ తాత్సారం చేస్తున్నాడు శివేంద్ర యాదవ్. ఈ విషయమై అంజలి-శివేంద్ర మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. ఆమెకి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
రోజులు గడుస్తున్నా శివేంద్రయాదవ్ మాత్రం డబ్బులు ఇవ్వలేదు. రోజు రోజుకూ అంజలి టార్చర్ పెరగడంతో తట్టుకోలేక పోయాడు. అంజలి వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించాడు. ఆమెకు మగదిక్కు ఎలాగూ లేరు.. చంపిస్తే ఎలాంటి తలనొప్పి ఉండదని భావించాడు రియల్టర్. ఈ పని ఎవరికి అప్పగిస్తే బాగుంటుందనే ఆలోచనలో పడ్డాడు. ఎవరికో ఈ పని అప్పగించే బదులు, తన సహాయకుడితో హత్యకు ప్లాన్ చేశాడు.
ALSO READ: సోషల్ మీడియాలో న్యూస్ వీడియోలు.. ప్రాణాలు తీసుకున్న యువతి
ప్లాన్ ప్రకారం హత్య
వేసుకున్న ప్లాన్ ప్రకారం అంజలికి ఫోన్ చేసి ఇవ్వాల్సిన డబ్బు ఇస్తాను.. తన ఇంటికి రావాలని పిలిచాడు. రియల్టర్ మాటల వెనుక లోపల అర్థాన్ని పసిగట్టలేకపోయింది అంజలి. ఆ డబ్బు వస్తే పిల్లలకు మంచి చేయాలని రకరకాలుగా ప్లాన్ చేసుకుంది. శివేంద్ర మాటలు నమ్మిన అక్కడికి వెళ్లింది అంజలి. శివేంద్ర, ఆయన సహాయకుడు గౌరవ్ ఇద్దరు కలిసి ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు.
ఆమె మద్యం మత్తులోకి వెళ్లిపోవడంతో గొంతు కోసి హత్య చేశారు. అంజలి మృతదేహాన్ని తగులబెట్టారు కాలిన మృతదేహాన్ని యమునా నదిలో పడేశారు. ఈ సీన్ అంతా రాత్రి వేళ జరిగినట్టు తెలుస్తోంది. గడిచిన ఐదు రోజులుగా అంజలి కనిపించలేదు దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.
ఫోన్ ఆధారంగా గుర్తింపు
అంతకు ముందు అంజలి కోసం తండ్రి వీడియో కాల్ చేశాడు. దాని ఆధారంగా ఆమె ఫోన్ ని ట్రాక్ చేశారు పోలీసులు. స్కూటీ ఆధారంగా యుమునా నది సమీపంలో ఉన్నట్టు తేల్చారు. దర్యాప్తులో భాగంగా రియల్టర్ శివేంద్రను విచారించారు పోలీసులు. దీంతో అసలు గుట్టు బయటపడింది. అంజలిని తాను హత్య చేసినట్టు అంగీకరించారు రియల్టర్. తనతోపాటు సహాయకుడు గౌరవ్ కూడా ఉన్నాడని తెలిపారు.
భూమి కోసం ఇచ్చిన డబ్బు పదేపదే డబ్బులు అడుగుతున్న కారణంతో హత్య చేసినట్టు వెల్లడించారు. శనివారం సాయంత్రం అంజలి మృతదేహాన్ని నదిలో నుంచి బయటకు తీశారు. అంజలి డెడ్ బాడీని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చివరకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు.