Tree Symbols In IPL : సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ లు వీక్షీంచే వారికి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఏంటంటే..? ఒక ఓవర్ లో ఒక బంతికి పరుగులు రాకుంటే స్కోర్ కార్డులో డాట్ లు కనిపించాలి. కానీ ఆకుపచ్చ చెట్ల చిహ్నాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఇలా ఎందుకు కనిపిస్తుందని కొందరికీ తెలిసినా చాలా మందికి ఇలా ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. అది ఎందుకు అంటే.. ప్రతి డాట్ బాల్ కి బీసీసీఐ మొక్కలు నాటుతుంది. 2023 నుంచి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది బీసీసీఐ. ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ టాటా గ్రూప్ తో కలిసి ఈ ఇన్సియేటివ్ తీసుకుంది. గతంలో ప్లే ఆప్స్ లో మాత్రమే డాల్స్ బాల్ కి 500 మొక్కలు నాటుతామని బీసీసీ ఐ ప్రకటించింది. దానికి అద్భుతమైన స్పందన రావడంతో WPL లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ప్రతిడాట్ బాల్ కి 18 మొక్కలు నాటుతామని వెల్లడించింది బీసీసీఔఐ. 2024 ప్లే ఆప్స్ లో నమోదైన డాల్స్ ని లెక్క గడితే మొత్తం 1,47,000 మొక్కలు నాటాలని లెక్క తేలింది. ఐపీఎల్ 2025లో ఇప్పటికే చాలా నో బాల్స్ నమోదు అయ్యాయి. ఈ సీజన్ లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లు కలిపితే.. 1800 కి పై చిలుకు డాట్ బాల్స్ నమోదయ్యాయి. ప్రతి డాట్ బాల్ కి 18 మొక్కలు ఉంటే.. 32 వేలకు పైగా మొక్కలు నాటాల్సి ఉంది. సీజన్ పూర్తయ్యే సరికి దాదాపు లక్ష దాటే అవకాశముంది. ఇన్ని మొక్కలు నాటితే పర్యావరణానికి చాలా మేలు జరుగుతుందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఫోర్, సిక్స్ కొడితే క్రికెట్ అభిమానులు ఎంత ఆనందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
అలాగే డాట్ బాల్ కూడా పడితే ప్రకృతి ప్రేమికులు కూడా అలాగే సంతోషిస్తారు. ఇది అంతా వినడానికి బాగానే ఉంది. కానీ అసలు బీసీసీఐ ఈ మొక్కలను ఎక్కడ నాటుతుంది.. నాటిన మొక్కల సంరక్షణ ఎవరు చూస్తున్నారు..? నాటిన మొక్కలు బతికాయా..? అసలు ఇవన్ని కేవలం లెక్కల్లోనే ఉన్నాయా..? వాస్తవానికి బీసీసీఐ మొక్కలు నాటుతుందా..? అంటే మాత్రం ఇప్పటివరకు సరైన ఆధారాలు బీసీసీఐ బయటికి వెల్లడించకపోవడం గమనార్హం. బెంగళూరు లో నూతనంగా నిర్మించిన నేషనల్ క్రికెట్ అకాడమీ, దానినే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని పేర్కొంటున్నారు. అక్కడ ఓ 4 లక్షల మొక్కలు నాటినట్టు గతంలో బీసీసీ ఓ పోస్ట్ చేసింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మొక్క నాటుతున్నట్టు ఓ ఫొటో పెట్టింది. అలాగే కేరల, గుజరాత్, అస్సాం వంటి రాష్ట్రాల్లో కూడా మొక్కలు నాటినట్టు తెలుస్తోంది. కచ్చితంగా ఈ స్థలంలో మొక్కలు నాటామని మాత్రం బీసీసీఐ చెప్పకపోవడం గమనార్హం. ఐపీఎల్ సీజన్ 2025 తరువాత అయినా డాట్ బాల్స్ కి సంబంధించి ఇన్ని మొక్కలు నాటాం. ఇక్కడ నాటామని అందరికీ చూపించి మీడియాకు తెలియజేస్తే బాగుంటుందని ప్రకృతి ప్రేమికులు కోరుకుంటున్నారు. ఈ విషయం పై బీసీసీఐ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.