Palnadu Woman Incident: సోషల్ మీడియాలో తన న్యూడ్ వీడియో వైరల్ కావడంతో ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన సినిమా స్టోరీని తలపిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నరసరావుపేట మండలం పమిడిమర్రుకు చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెందిన నాగరాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఒత్తిడి చేయడంతో న్యూడ్ వీడియోలను రికార్డ్ చేసి అతనికి పంపించింది. అయితే ఆ యువతితో మాత్రమే కాకుండా మరో మహిళతో కూడా నాగరాజు ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి మహిళను యువతి నిలదీసింది. మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.
దాంతో యువతిపై మహిళ పగ పెంచుకుంది. యువతికి సంబంధించిన న్యూడ్ వీడియోలను నాగరాజు దగ్గర నుంచి తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పరువు పోయిందనే మనస్తాపంతో యువతి ఎలుకల మందు తాగి సూసైడ్ చేసుకుంది. కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు. అయితే చికిత్స పొందుతూ యువతి ప్రాణాలు విడిచింది.
ALSO READ: పూజకు పీరియడ్స్ అడ్డుగా ఉన్నాయని మహిళ దారుణమైన నిర్ణయం
బాధితురాలి మరణానికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హాస్పిటల్ బయట యువతి బంధువులు ఆందోళనకు దిగారు. నాగరాజుతో పాటు ఆ మహిళను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందే తన వీడియో గురించి యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిందని మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పురుగుల మందు తాగిందని ఆరోపిస్తున్నారు.
అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. యువతి ఫిర్యాదు చేసిన తర్వాత కేసు ఫైల్ చేసున్నామని వెల్లడించారు. సోషల్ మీడియా నుంచి కూడా వీడియోలను డిలీట్ చేయించామని అన్నారు. ఈ కేసుపై కౌంటర్ కేసు కూడా ఫైల్ అయిందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని వెల్లడించారు. ఇది పూర్తయితే మరిన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు.