Riyaz Encounter: నిజామాబాద్ జిల్లాలో జరిగిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ (28) సోమవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గత వారం 17న జరిగిన ఘోర హత్య తర్వాత పోలీసులు రియాజ్‌ను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు అప్పటికే గాయాలతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) కి తరలించి చికిత్స అందించారు.
వివరాల్లోకి వెళ్తే.. గత రెండు రోజుల క్రితం నిజామాబాద్ పట్టణంలో కానిస్టేబుల్ ప్రమోద్‌ను అతికిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో రియాజ్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రౌడీషీటర్ రియాజ్ ఆదివారం మధ్యాహ్నం సారంగపూర్ అటవీప్రాంతంలో చిక్కాడు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోయే క్రమంలో.. రియాజ్‌ను గుర్తించి ఓ యువకుడు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆ వ్యక్తి రియాజ్‌పై దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
అనంతరం పోలీసులు రియాజ్‌ను ఆసుపత్రిలోకి చేర్చారు. నిందితుడు రియాజ్ ముఖం, ఛాతీభాగంలో గాయాలు కావటంతో.. ఎక్స్ రే, స్కానింగ్‌లు చేశారు. 4 రకాల ఎక్స్ రే టెస్ట్‌లు చేశారు. హై సెక్యూరిటీ మధ్య రియాజ్‌కు చికిత్స అందించారు. కాగా ఆసుపత్రి నుంచి తప్పించుకునేందుకు రియాజ్ ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. పోలీసులు నుంచి ఆయుధం గుంజుకునేందుకు ప్రయత్నించాడు రియాజ్. దీంతో గన్ ఫైరింగ్ చేయడంతో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందారు.
రియాజ్‌ను పట్టుకునేందుకు వచ్చిన ఆసిఫ్‌ను కత్తితో గాయపరచడంతో.. అతని చేతికి తీవ్ర గాయం అయ్యింది. దీంతో అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
నిజామాబాద్ కాల్పులపై డీజీపీ శివధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్, అమరుడు ఎంపల్లి ప్రమోద్ కుమార్‌కు పోలీసు శాఖ తరుపున ఘన నివాళులు అర్పించారు.
Also Read: బిగ్ బ్రేకింగ్.. సీఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడి కన్నుమూత
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ను పూర్తి స్థాయిలో కాపాడేందుకు.. తెలంగాణ పోలీసు శాఖ నిబద్దతతో ఉందన్నారు. ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణచివేస్తాం ఘాటుగా స్పందించారు.
భర్త ప్రమోద్‌ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం, పోలీసు శాఖ పూర్తి స్తాయిలో అండగా ఉంటామని తెలిపారు.
GO Rt No. 411 ప్రకారం ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీ తో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, GO 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేశారు. అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం అన్నారు.