E-Paper
Advertisement

Palnadu Crime: బావమరిదిని సిలిండర్‌తో కొట్టి చంపిన బావ

Palnadu Crime: బావమరిదిని సిలిండర్‌తో కొట్టి చంపిన బావ
Advertisement

Palnadu Crime: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన ఇంట్లో రక్తపాతం విలయతాండవం చేసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన సొంత బావమరిదినే గ్యాస్ సిలిండర్‌తో తలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

 వినుకొండకు చెందిన షారోన్ అనే యువకుడు, తన సోదరిని అదే ప్రాంతానికి చెందిన చిలక గోపికి ఇచ్చి వివాహం చేశాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే..  గత కొంతకాలంగా బావ గోపి, బావమరిది షారోన్ మధ్య కుటుంబపరమైన విషయాల్లో మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ గొడవలు ముదిరి ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో పాత కక్షలు ఏర్పడ్డాయి.

Advertisement

క్రిస్టమస్ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో షారోన్ రెండు రోజుల క్రితమే తన సోదరి ఇంటికి వచ్చాడు. పండుగ సంబరాల్లో అందరూ నిమగ్నమై ఉండగా, గోపి మాత్రం తన మనసులో ఉన్న పాత కక్షలను అదును చూసి తీర్చుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలోనే.. షారోన్ గాఢనిద్రలో ఉన్న సమయంలో గోపి ఇంట్లోని చిన్న గ్యాస్ సిలిండర్‌ను తీసుకువచ్చి  ఒక్కసారిగా షారోన్ తలపై బలంగా కొట్టాడు.

తీవ్రమైన దెబ్బ తగలడంతో షారోన్ రక్తపు మడుగులో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రికి చేరుకునే లోపే షారోన్ ప్రాణాలు విడిచాడు. నిందితుడు గోపి ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నవారి కళ్లముందే కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

ALSO READ: Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. భార్యను పిడిగుద్దులతో చంపిన భర్త

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×