Hyderabad Crime: హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో భర్త చేతిలో భార్య మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజు, విజయలక్ష్మి అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గత ఎనిమిదేళ్లుగా మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో నివాసం ఉంటున్నారు. రాజు ఇటీవల కాలంలో జల్సాలకు అలవాటు పడి బాధ్యతారహితంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఈ విషయమై భార్య విజయలక్ష్మి తరచూ మందలించడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు చెప్పాలని విజయలక్ష్మి నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆమె ఇంటి నుంచి బయలుదేరగా.. దారిలోనే రాజు ఆమెను అడ్డగించాడు. ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. ఆగ్రహంతో ఊగిపోయిన రాజు నియంత్రణ కోల్పోయి భార్యపై పిడిగుద్దులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
దాడిలో విజయలక్ష్మి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. పరిస్థితి విషమించడంతో రాజే ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ విజయలక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు చిన్నపిల్లలు తల్లిని కోల్పోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసుపై సమగ్ర విచారణ కొనసాగుతున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.
ASLO READ: Viral Video: దారుణం.. ప్రేమించలేదని నడి రోడ్డుపై యువతిపై దాడి చేసి బట్టలు..?
హైదరాబాద్ లోని మియాపూర్ లో భార్యని చంపిన భర్త
మియాపూర్ లోని గోకుల్ ప్లాట్స్ లో గత ఎనిమిదేళ్లుగా నివాసం ఉంటున్న భర్త రాజు, భార్య విజయలక్ష్మీ
గత కొంత కాలంగా జల్సాలకు అలవాటు పడిన భర్త రాజు
భార్య నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆమెపై పిడిగుద్దులతో దాడి చేసిన భర్త
ఆస్పత్రిలో చికిత్స… pic.twitter.com/4weehFoBMf
— BIG TV Breaking News (@bigtvtelugu) December 24, 2025