Visakhapatnam Swiggy Boy: పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడో ప్రబుద్ధుడు. విశాఖపట్నంలోని రణస్థలం ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. చంద్రశేఖర్ చేతుల నుంచి తప్పించుకున్న బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు.
అత్యాచారయత్నం ఘటనలు అవుతూనే ఉన్నాయి. ఎన్ని సార్లు, ఎంత కఠినంగా చట్టాలు ఉన్నా.. రిమాండ్‌కు తరలించిన, జైల్లో పెట్టిన, కేసులు పెట్టిన కూడా కొంత మంది దుర్మార్గులు తమ బుద్దిని మార్చుకోవడం లేదు. దీనికి సంబంధించినటువంటి ఒక న్యూస్ మళ్లీ సంచలనం రేపుతోంది. విశాఖపట్నంలోని రణస్థలం ప్రాంతానికి చెందినటువంటి చంద్రశేఖర్ స్విగ్గీ బాయ్‌గా పని చేస్తున్నాడు. తన ఇంటి కింద పనిచేస్తున్నటువంటి 7 తరగతి చదువుతున్న బాలికపైన అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఎలాగోలా ఆ బాలిక చంద్రశేఖర్ చేతిలో నుంచి తప్పించుకుని బయటపడింది.
Also Read: అలిగిన అరవింద్ ధర్మపురి!
అయితే తప్పించుకున్న ఆ బాలిక తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి చంద్రశేఖర్ వేధిస్తున్నాడని చెప్పింది. దీంతో అతని నిజ స్వరూపం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసిన నేపథ్యంలో నిందితుడిని రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడే అనే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. చిన్నారులను చిదిమేసే కామాంధుల అడుగడుగునా కనిపిస్తున్నారు. సో, చిన్నారులను బయటకు పంపించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, వారికి బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు చెప్పాలని హెచ్చరిస్తున్నారు.