Mitraaw Sharma.. మిత్రా శర్మ (Mitraaw Sharma).. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలలో కంటే ఈమె ఇతరులకు సహాయం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే నిన్న ప్రముఖ సీనియర్ నటి పాకీజా (Pakeezah) కు ఏకంగా 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఈమె.. ఇప్పుడు మరో వికలాంగుడికి భారీ సహాయం అందించింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వికలాంగుడికి భారీ సహాయం ప్రకటించిన మిత్రా శర్మ..
మిత్రా శర్మ.. బిగ్ బాస్ షో తో పాటు సినిమాలతో కూడా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె తాజాగా ‘వర్జిన్ బాయ్స్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో మిత్రా శర్మతో పాటు సినిమా నటీనటులు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి మిత్ర సహాయం పొందడానికి వచ్చిన ఒక వికలాంగుడు.. మిత్ర వద్ద తన బాధను చెప్పుకున్నారు. ముఖ్యంగా తరచూ గాంధీ నగర్ హాస్పిటల్ కి రావాలి అంటే ఇబ్బంది అవుతోందని.. తనకు ఒక ఎలక్ట్రిక్ బైక్ కావాలి అని హీరోయిన్ ని అడిగారు. ఇక వెంటనే అతడి కష్టానికి చలించి పోయిన మిత్రా శర్మ 15 రోజుల్లో మీరు అడిగిన బైక్ మీ ఇంటికి వస్తుంది అంటూ హామీ ఇచ్చింది. ఇక ఈ విషయం తెలిసి ఈమెపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మిత్ర ముందు స్టార్ హీరోలు కూడా వేస్ట్..
ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చి కొంతకాలమే అయినా.. చిన్న హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈమె ఇలా వరుసగా అవసరమైన వారికి భారీ సహాయాన్ని అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటూ ఉండడంతో ఈమెపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో స్టార్ హీరోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న హీరోయినైనా గొప్ప మనసు చాటుకుంటుంది. వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం కాదు కనీసం ఇలాంటి వాళ్లకు సహాయం చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
జవాన్ మురళీ నాయక్ కు మిత్ర శర్మ భారీ విరాళం.
ఇకపోతే జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఈయనకు నివాళులర్పించడానికి సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్, మాజీ CM జగన్మోహన్ రెడ్డి అందరు విచ్చేసిన విషయం తెలిసిందే. అందరూ కూడా తమ వంతు సహాయం ప్రకటించారు. ఇక మిత్రా శర్మ కూడా మురళి నాయక్ సమాధిని సందర్శించి, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసింది. ఒకరు కాదు ఇద్దరి కాదు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు అండగా నిలుస్తోంది.
also read:OM Shanti release date: మరో అద్భుతమైన కథకు ముహూర్తం ఫిక్స్ చేసిన ‘ 35’ మేకర్స్.. ఎప్పుడంటే?