BigTV English

Japan EarthQuakes: గత రెండు వారాల్లో 1000 భూకంపాలు.. ఆ దీవులను ఖాళీ చేయిస్తున్న జపాన్, ఏం జరుగుతోంది?

Japan EarthQuakes: గత రెండు వారాల్లో 1000 భూకంపాలు.. ఆ దీవులను ఖాళీ చేయిస్తున్న జపాన్, ఏం జరుగుతోంది?

Japan EarthQuakes| జపాన్ దేశంలో భూకంపాలు ఆగడం లేదు. ప్రతిరోజు భూకంపాలతో అక్కడి జనం ఆందోళనకు గురవుతున్నారు. గత రెండు వారాల్లో 1,000కి పైగా భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు భవిష్యత్తు గురించి భయపడుతున్నారు. జులై 5, 2025న భారీ విపత్తు సంభవిస్తుందని మాంగా కామిక్ బుక్ తాజా ఎడిషన్‌లో హెచ్చరికగా అనిపించడంతో, జపాన్‌కు వెళ్లాలనుకునే విదేశీయులు తమ ప్రణాళికలను మార్చుకుంటున్నారు. ఈ భయం వల్ల జపాన్‌లో పర్యాటక రంగం కూడా దెబ్బతింటోంది.


భూకంపాలతో వణికిపోతున్న జనం
రెండు వారాల్లో వచ్చిన 1,000 భూకంపాలు ఎటువంటి సునామీ హెచ్చరికలు లేదా నష్టాన్ని కలిగించలేదు. అయినప్పటికీ, ప్రజలు ఆందోళన చెందుతుండడంతో జపాన్ ప్రభుత్వం ప్రజలను పుకార్లను నమ్మవద్దని కోరింది. అదే సమయంలో, దేశంలోని ప్రధాన దీవుల దక్షిణ-పశ్చిమ సముద్రాలలో మరింత బలమైన భూకంపాలు సంభవించవచ్చని హెచ్చరించింది. జపాన్ మెటీరియోలాజికల్ ఏజెన్సీ భూకంప, సునామీ మానిటరింగ్ డైరెక్టర్ అయతకా ఎబిటా మాట్లాడుతూ.. “ప్రస్తుత శాస్త్రీయ జ్ఞానంతో భూకంపం యొక్క ఖచ్చితమైన సమయం, స్థలం లేదా తీవ్రతను అంచనా వేయడం కష్టం” అని అన్నారు.

నిద్రపోవడానికి కూడా భయం
మాంగా కామిక్ ఎడిషన్‌లో జులై 5న భారీ విపత్తు గురించి హెచ్చరికగా అనిపించే సూచనలతో, ఈ భూకంపాలు ప్రజలను మరింత భయపెడుతున్నాయి. “నిద్రపోవడానికి కూడా భయంగా ఉంది. ఎప్పుడూ ఏదో కదులుతున్నట్లు అనిపిస్తోంది,” అని ఒక పౌరుడు మీడియాతో చెప్పాడు. సుమారు 700 మంది నివసించే ప్రాంతమైన టోకరా దీవులు..ఈ భూకంపాల ధాటికి నాశనమయ్యాయి. ఈ దీవుల్లో చాలా వరకు హాస్పిటల్ సౌకర్యాలు తక్షణం అందుబాటులో లేవు.


దీవుల్లో నివసించే వారు. భూకంపం రాకముందు సముద్రం నుండి భారీ “గర్జన” వినిపిస్తుందని, ఈ పరిస్థితి “అసాధారణమైనది” అని చెప్పారు. అకుసేకిజిమా దీవిలో నివసించే ఇసాము సకమోటో, “భూకంపం కింది నుండి ఒక దెబ్బతో మొదలవుతుంది, ఆ తర్వాత ఇల్లు కదులుతుంది. దీంతో భయంగా ఉంటోంది. చాలా మంది ఇళ్ల కింద పడి గాయపడ్డారు ” అని చెప్పారు.

పర్యాటక రంగంపై ప్రభావం
ఈ ఏడాది ఏప్రిల్‌లో 39 లక్షల మంది పర్యాటకులు జపాన్‌ను సందర్శించినప్పటికీ.. ప్రస్తుతం పర్యాటకం గణనీయంగా తగ్గింది. హాంకాంగ్ నుండి వచ్చే పర్యాటకులు 11 శాతం తగ్గారు, హాంకాంగ్ నుండి జపాన్‌కు వచ్చే అనేక విమానాలు రద్దయ్యాయి. డూమ్స్‌డే పుకార్లు ఈ తగ్గుదలకు కారణంగా ఉన్నాయి.

మాంగా జోస్యం అంటే ఏమిటి?
మాంగా అనేది జపాన్‌లో చాలా ప్రజాదరణ పొందిన కామిక్ బుక్ సిరీస్. ఇది గతంలో విపత్తులను కచ్చితంగా జోస్యం చెప్పిందని చాలా మంది నమ్ముతారు. 2011లో.. 9.0 తీవ్రతతో సంభవించిన సునామీ, భూకంపం వల్ల సుమారు 20,000 మంది మరణించారు. ఈ విపత్తును 1999లో మాంగా మొదటి ఎడిషన్‌లో జోస్యం చెప్పినట్లు చాలా మంది చెబుతారు.

ప్రస్తుతం కూడా ఇలాంటి భయం నెలకొంది. తాజా మాంగా ఎడిషన్ జులై 5, 2025న జపాన్‌లో భారీ విపత్తు సంభవిస్తుందని హెచ్చరిస్తోందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే, ‘ది ఫ్యూచర్ ఐ సా’ అనే మాంగా రచయిత ‘ర్యో తత్సుకి’.. తాను జోస్యం చెప్పేవాడిని కాదని, ఈ ఊహాగానాలను తోసిపుచ్చారు.

Also Read: యజమాని భార్య, కొడుకుని హత్య చేసిన ఉద్యోగి.. ఆ పని చేయమని అడిగినందుకే

జపాన్‌లో భూకంపాలు, మాంగా జోస్యం గురించిన పుకార్లు ప్రజలలో భయాన్ని, పర్యాటక రంగంలో తగ్గుదలను కలిగిస్తున్నాయి. అయినప్పటికీ, ప్రజలను శాంతియుతంగా ఉండమని, సైంటిఫిక్ ఆధారాలను మాత్రమే నమ్మాలని ప్రభుత్వం కోరుతోంది.

Related News

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Earthquake: సౌత్ అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం.. 7.5గా నమోదు

Big Stories

×