Vizag News: 13 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందుకు కారణం ఏదో అనుకుంటే పొరపాటే. కేవలం తల్లిదండ్రులు ఆన్లైన్ గేమ్స్ ఆడ వద్దని మందలించడంతో ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆ బాలుడు. ఈ ఘటన వైజాగ్ లోని అక్కయ్యపాలెం ఎన్జీవోస్ కాలనీలో మంగళవారం జరిగింది.
నేటి రోజుల్లో చిన్నారులు ఎక్కువగా మొబైల్ ఫోన్లకు, ఆన్లైన్ గేమ్స్ కి అమితంగా ఆకర్షితులవుతున్నారు. పూర్వం పాఠశాల లేదంటే, ఏదో ఒక ఆటలు మాట్లాడుకునే చిన్నారులు నేటి రోజుల్లో మొబైల్ ఫోన్లో చేతిలో పట్టుకుని ఆన్లైన్ గేమ్స్ కి బానిసలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు మందులిస్తే చాలు, ఆహారం తినకుండా మారాం చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అయితే వైజాగ్లో ఓ కుర్రవాడు ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని తల్లిదండ్రులు మందలించినందుకు ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చాడు.
అక్కయ్యపాలెం ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఓ బాలుడు నిరంతరం ఆన్లైన్ గేమ్స్, హర్రర్ వీడియోలు చూసేవాడు. రోజు తల్లిదండ్రులు ఆ బాలుడిని మందలించేవారు. కానీ 13 ఏళ్ల వయసుగల బాలుడు తల్లిదండ్రులు గట్టిగా మందలించడంతో షూ లేస్ తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని బాలుడు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడు ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రధాన కారణం దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Also Read: WhatsApp : ఓకే వాట్సాప్ నెంబర్ ను రెండు డివైజస్ లో వాడొచ్చా..!
బాలుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. ఈ విషయం స్థానికులకు తెలియడంతో, బాలుడి మృతదేహాన్ని చూసేందుకు తరలివచ్చారు. అలాగే బాలుడి ఫ్రెండ్స్ కూడా అక్కడికి చేరుకొని, సదరు బాలుడి మృతదేహానికి నివాళులర్పించారు. ఎవరైనా చిన్నారులు ఇలాంటి స్థితిలో ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడితే, మానసిక వ్యాధి నిపుణులను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.
విషాదం.. షూ లేస్తో ఉరి వేసుకుని బాలుడు ఆత్మహత్య
విశాఖ-అక్కయ్యపాలెం ఎన్జీవోస్ కాలనీలో ఘటన
షూ లేస్తో ఉరి వేసుకున్న 13 ఏళ్ల బాలుడు
ఆన్లైన్ గేమ్స్, హర్రర్ వీడియోలు చూడవద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపంతో బాలుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం
కేసు నమోదు చేసి దర్యాప్తు… pic.twitter.com/NsVsGQeGZf
— BIG TV Breaking News (@bigtvtelugu) December 24, 2024