BigTV English

WhatsApp : ఓకే వాట్సాప్ నెంబర్ ను రెండు డివైజస్ లో వాడొచ్చా..!

WhatsApp : ఓకే వాట్సాప్ నెంబర్ ను రెండు డివైజస్ లో వాడొచ్చా..!

WhatsApp : వాట్సాప్​లో లింక్డ్​ డివైసెస్​ అనే ఫీచర్​ ఉంటుంది. దీని ద్వారా ఒకే సారి నాలుగు వేరు వేరు డివైసెస్​లో ఒకే వాట్సాప్​ అకౌంట్​ను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్​ను, వాట్సప్​ అకౌంట్​ ఉన్న ప్రైమరీ ఫోన్​లో కాన్​స్టంట్లీగా ఇంటర్నెట్ కనెక్షన్​ లేకుండానే ఉపయోగించుకోవచ్చు. అంటే మీ ప్రైమరీ ఫోన్​లో నెట్ ఆఫ్​లో ఉన్నప్పటికీ ఇతర డివైసెస్​లో (ల్యాప్​ టాప్​, ఫోన్, ట్యాబ్లెట్​) మెసేజెస్​ సెండ్ అండ్ రిసీవ్​ అవుతూనే ఉంటాయి. అయితే లేటెస్ట్ వెర్షన్​ వాట్సాప్​ మాత్రమే ఎటువంటి ఇష్యూస్​ లేకుండా కనెక్ట్ అవుతందనేది గుర్తుంచుకోవాలి.


ఒకేసారి రెండు మొబైల్స్​లో ఉపయోగించాలంటే? –

మీ వాట్సాప్​ అకౌంట్​ను మీ సెకండరీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్​లో ఉపయోగించాలంటే ఈ స్టెప్స్​ను ఫాలో అవ్వాలి.


స్టెప్ 1 – ప్రైమరీ డివైస్​లో వాట్సాప్​ను ఓపెన్ చేయాలి.

స్టెప్ 2 – స్క్రీన్​లోని టాప్ రైట్​ కార్నర్​లో, మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్​ ఓపెన్​ చేయాలి. అందులో లింక్డ్​ డివైసెస్​ ఆప్షన్​పై క్లిక్ చేయాలి.

స్టెప్ 3 – లింక్డ్​ డివైసెస్​ సెక్షన్​లో లింక్​ ఏ డివైస్​ను క్లిక్ చేయాలి. అది మీ క్యూఆర్ కోడ్ స్కానర్​ను యాక్టివేట్ చేస్తుంది.

స్టెప్ 4 – అప్పుడు సెకండరీ ఫోన్​లోకి వెళ్లి వాట్సాప్​ను ఓపెన్ చేయాలి.

స్టెప్ 5 – అందులో మీ నెంబర్​తో లాగిన్ అవ్వాలి. టాప్ రైట్ కార్నర్​లోని మూడు చుక్కలను క్లిక్ చేసి అందులో లింక్​ యాజ్​ ఏ కంపానియన్ డివైస్​ను సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్ 6 – అప్పుడు సెకండీ ఫోన్​లో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మీ ప్రైమరీ ఫోన్​లోని క్యూఆర్​ స్కానర్​లో సెకండరీ ఫోన్​ కోడ్​ను స్కాన్ చేయాలి. ఒకసారి స్కాన్ సక్సెస్​ఫుల్ అయిపోతే, మీ వాట్సప్​ చాట్ లోడ్ అయిపోతాయి. ఎంచక్కా రెండు ఫోన్లలోనూ కన్వర్​జేషన్స్​ చూడొచ్చు.

ల్యాప్‌టాప్‌లో వాట్సాప్‌ను ఎలా లింక్ చేయాలంటే –

WhatsApp వినియోగదారులు తమ ఖాతాలను ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్‌కు కనెక్ట్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. ఇది కంప్యూటర్‌లో ఎక్కువ సమయం గడిపే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ల్యాప్‌టాప్‌కి WhatsAppను ఎలా లింక్ చేయాలంటే..

స్టెప్ 1 – ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో వెబ్ బ్రౌజర్‌ని తెరిచి, web.whatsapp.comకి వెళ్లండి. స్క్రీన్‌పై QR కోడ్‌ కనిపిస్తుంది.

స్టెప్ 2 – ఇప్పుడు ప్రైమరీ మెుబైల్ లో WhatsApp యాప్‌ను ఓపెన్ చేసి.. లింక్డ్ డివైజస్ ను క్లిక్ చేయాలి.

స్టెప్ 3 – లింక్డ్ డివైజస్ లో ల్యాప్టాప్ ను లింక్ చేసి ఎంచుకోండి. ఆపై, WhatsApp వెబ్ పేజీలో కనిపించే QR కోడ్‌ను స్కాన్ చేయాలి.

స్టెప్ 4 – QR కోడ్‌ను స్కాన్ చేశాక WhatsApp చాట్‌లు వెబ్ వెర్షన్‌తో కనిపిస్తాయి. ఆపై ల్యాప్‌టాప్‌లో WhatsAppను ఈజీగా ఉపయోగించవచ్చు.

ఎక్కువ డివైజస్ లో వాట్సాప్ ను ఉపయోగిస్తున్నప్పుడు గుర్తుంచుకోవల్సిన విషయాలు –

Active internet connection : లింక్ చేయబడిన డివైజస్ లో WhatsAppను ఉపయోగించడానికి, ప్రైమరీ డివైజ్ ను ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయాలి. కానీ లింక్ చేసిన గ్యాడ్జెట్స్ మాత్రం ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తాయి.

Limit on number of devices : WhatsApp ను ఒకేసారి నాలుగు డివైజస్ లో ఉపయోగించే ఛాన్స్ ఉంటుంది.

Security considerations : వాట్సాప్ ను వేరే డివైజస్ లో ఉపయోగిస్తున్నప్పుడు సెక్యూరిటీ గురించి ఆలోచించాలి. వేరే వాళ్ల చేతికి మీ డేటా చిక్కకుండా జాగ్రత్త పడాలి.

ALSO READ : బ్లూటూత్‌ కనెక్షన్, ఛార్జింగ్‌ పోర్ట్‌.. ఓహో హోండా కొత్త బైక్ ఫీచర్సే.. ఫీచర్స్!

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×