E-Paper
Advertisement

AP Crime: గోదావరి జిల్లాలో దారుణం.. ముస్తాబవ్వాల్సిన పెళ్లి కూతురు శవమై కనిపించింది, అసలు మేటరేంటి?

AP Crime: గోదావరి జిల్లాలో దారుణం.. ముస్తాబవ్వాల్సిన పెళ్లి కూతురు శవమై కనిపించింది, అసలు మేటరేంటి?
Advertisement

AP Crime: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దొడ్డిపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) వైద్యురాలిగా సేవలందిస్తున్న డాక్టర్ కర్రి చంద్రరేఖ (30) నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వృత్తిరీత్యా ఎంతో మందికి ప్రాణదానం చేయాల్సిన వైద్యురాలు, ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం స్థానికంగా అందరినీ కలిచివేసింది.

ఘటనకు గల కారణాలను పరిశీలిస్తే.. కుటుంబ సభ్యులు కుదిర్చిన వివాహం ఆమెకు ఇష్టం లేకపోవడమే ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పెళ్లి విషయంలో గత కొద్దిరోజులుగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన ఆమె, విధి నిర్వహణలో ఉంటూనే ప్రాణాంతక నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం చంద్రరేఖ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆమె కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తోటి సిబ్బంది సైతం ఆమె మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read: భయం గుప్పిట్లో కామారెడ్డి.. గంటల వ్యవధిలో ఐదుగురు పిల్లలు మిస్సింగ్

Advertisement

ప్రస్తుతం యలమంచిలి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె మరణానికి కేవలం వివాహ సంబంధిత ఒత్తిడే కారణమా లేక మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×