BigTV English

Wife Cuts Husband Genital: దీపావళి రోజు మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త.. అతని ప్రైవేట్ పార్ట్ కోసేసిన భార్య!

Wife Cuts Husband Genital: దీపావళి రోజు మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త.. అతని ప్రైవేట్ పార్ట్ కోసేసిన భార్య!

Wife Cuts Husband Genital| దేశ రాజధాని ఢిల్లీలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. నిద్రపోతున్న భర్త పురుషాంగాన్ని అతడి భార్య కోసేసింది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవకారణంగా ఇంతటి ఘోరం జరిగిపోవడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొన్ని ఆస్పత్రికి తరలించారు.


పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన నవ దంపతులు కొన్ని నెలల క్రితమే ఢిల్లీలోని శక్తి నగర్‌కు వచ్చారు. ఆ యువకుడికి సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో సెక్యూరిటీ ఉద్యోగం లభించింది. భార్యా భర్తలిద్దరికీ ఇది మూడో వివాహం. ఇంట్లో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో అక్టోబర్ 31 2024 రాత్రి దీపావళి పండుగ సందర్భంగా ఆ యువకుడు తన స్నేహితులతో బయటికి వెళ్లాడు.

అర్ధ రాత్రి దాటాక తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆ యువకుడు మద్యం సేవించి ఉన్నాడు. దీంతో ఇంట్లో అతని కోసం ఎదురుచూస్తున్న భార్య అతనితో గొడవపడింది. ఇద్దరూ మళ్లీ గొడవపడ్డారు. ఆ తరువాత అతని భార్య ఏడుస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అది చూసిన భర్తకూడా ఆమెను లెక్కచేయకుండా నిద్ర పోయాడు. అయితే కాసేపు తరువాత ఆమె తిరిగి వచ్చింది. దాదాపు రాత్రి 2 గంటల సమయంలో ఇంట్లో కత్తిలాంటి పదునైన వస్తువుతో నిద్రపోతున్న తన భర్త పురుషాంగాన్ని కట్ చేసేసింది.


Also Read: స్కృడ్రైవర్‌తో పొడిచి పొడిచి హత్య.. భర్తను వదిలి బాయ్‌ఫ్రెండ్‌తో 4 పిల్లల తల్లి సహజీవనం

నొప్పి భరించలేక ఆ యువకుడు నిద్రలోనుంచి లేచి చూడగా.. భార్య కత్తి పట్టుకొని అతడిని హత్య చేసేందుకు ప్రయత్నించింది. అప్పటికే అతడు గట్టిగా అరుపులు వేయడంతో పొరుగింటి వారు తలుపు తట్టారు. ఇది గమనించిన ఆ యువతి అక్కడి నుంచి పారిపోయింది. పొరుగించివారు పరిస్థితి గమనించి పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. అతని భార్య పరారీలో ఉండగా.. ఆమె కోసం గాలిస్తున్నామని చెప్పారు.

ఇలాంటి చిన్న గొడవ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగింది. ఆ గొడవలో క్షణికావేశంలో ఒకరు మరొకరిని తలపై కొట్టగా అతడు మరణించాడు. మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని ఒక స్నేహితుడు మరో స్నేహితుడిని హత్య చేసిన ఘటన ఢిల్లీలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గాజియాబాద్ జిల్లాకి చెందిన నిరాలా సాహు (30) అనే యువకుడు ఢిల్లీ నగరంలోని ఆనంద్ విహార్ లో నివసిస్తున్నాడు. అతను సమీపంలోని ఒక బేకరిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి అంకిత్ మిశ్రా అనే యువకుడితో పరిచయమైంది. దీపావళి రోజు రాత్రి ఇద్దరూ కలిసి నిరాలా సాహు ఇంట్లో మద్యం సేవించారు.

కానీ అంకిత్ ఇంకా తాగుదామని తాను మద్యం తీసుకువస్తానని అందుకోసం డబ్బులు ఇవ్వాలని అడిగాడు. కానీ నిరాలా ఇక తాగింది చాలు. తనకు ఉదయం బేకరీ డ్యూటీకి వెళ్లాల్సి ఉందని చెప్పాడు. అయితే అంకిత్ మాత్రం తనకు మద్యం ఇంకా తాగాలని ఉందని తన వద్ద డబ్బులు లేవని.. రూ.400 ఇవ్వాలసి అడిగాడు. అందుకు నిరాలా మాత్రం ససేమిరా అన్నాడు. ఈ క్రమంలో తాగుబోతు,నిరుద్యోగి అయిన అంకిత్ తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని గొడవ చేశాడు.

నిరాల మాత్రం తాను ఇక డబ్బులు ఇచ్చేది లేదు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. అంకిత్ అప్పుడు కోపంతో బయటికి వెళ్లి పెద్ద ఇటుక రాయి తీసుకొని వచ్చాడు. నిరాలా మాత్రం మద్యం తాగిన మత్తులో ఉండగా.. వెనుక నుంచి వచ్చి అంకిత్ అతని తలపై బలంగా పలుమార్లు కొట్టాడు. దీంతో నిరాలా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. నిరాలా చనిపోయిన తరువాత అతని జేజు నుంచి రూ.400 దొంగలించి అంకిత్ మద్యం సేవించాడు.

రెండు రోజుల తరువాత నిరాలా ఇంటి నుంచి శవం వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా.. నిరాలా ఇల్లు తెరిచే ఉంది. లోపలికి వెళ్లి చూస్తే.. అతను రక్తపుమడుగులో పడి ఉన్నాడు. పోలీసులు సమాచారం అందుకొని శవాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. విచారణ చేయగా.. అంకిత్ పై అనుమానం వచ్చింది. చుట్టు పక్కల సిసిటీవి వీడియో ఆధారంగా నిరాలా హత్య కేసులో అంకిత్ ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Related News

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

kolkata: కోల్‌క‌తాలో భారీ వ‌ర్షం.. ఐదుగురు మృతి!

Building Collapse: కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు సజీవ సమాధి

Khammam: ఖానాపురంలో దారుణం.. కూర వేయలేదని మహిళపై గొడ్డలితో దాడి

Kerala News: భార్యని చంపిన భర్త.. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో లైవ్, అసలు మేటర్ ఇదీ?

Instagram love: ప్రియురాలిని చంపి.. సూట్‌కేస్‌లో బాడీని కుక్కి.. సెల్పీ తీసుకున్న ప్రియుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Heart Attack: పుట్టినరోజు నాడే చావు.. బతుకమ్మ ఆడుతూ కుప్పకూలి మహిళ

Guntur: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో యువతి అనుమానస్పద మృతి

Big Stories

×