BigTV English

Intercourse Death: పడకగదిలో భార్యతో కృూరంగా ప్రవర్తించిన బాడీ బిల్డర్.. యువతి మృతి

Intercourse Death: పడకగదిలో భార్యతో కృూరంగా ప్రవర్తించిన బాడీ బిల్డర్.. యువతి మృతి

Intercourse Death| భార్యాభర్తలు దాంపత్య జీవనాన్ని ఆస్వాదించాలి. అది ఆరోగ్యానికి మంచిది కూడా. కానీ ఇటీవల యువత అశ్లీల వీడియోలు చూసి తమ కోరికలను ఆ భంగిమలతో తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఒక బాడీ బిల్డర్ యువకుడు తన భార్యతో పడకగదిలో మృగంలా ప్రవర్తించాడు. దాని వల్ల చివరికి ఆమె ప్రాణాలే కోల్పోవల్సి వచ్చింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని హోసూర్ ప్రాంతంలో నివసించే భాస్కర్ (34) అనే బాడిబిల్డర్.. ఆ ప్రాంతంలో నాలుగు జిమ్ లు నడుపుతున్నాడు. అతను స్వయంగా జిమ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడు. అయితే రెండు రోజుల క్రితం అతని భార్య శశికళ అనుమాస్పదంగా మరణించింది. దీంతో భాస్కర్ తన భార్యను చంపేశాడని శశికళ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు భాస్కర్ ని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. అతను చెప్పింది విని పోలీసులు షాకైపోయారు.

పోలీసుల కథనం ప్రకారం.. భాస్కర్ , శశికళ 2018లో ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. తన భార్య శశికళను తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని.. అందుకే తామిద్దరం దాంపత్య సుఖం కోసం ప్రయోగాలు చేసామని చెప్పాడు. తాము పాశ్చాత్య ధోరణిలో పడకగదిలో అప్పుడప్పుడూ కలిశేవారమని శశికళ చనిపోయే ముందు కూడా అలాగే చేశామని.. అయితే అది వికటించి ఆమె చనిపోయిందని భాస్కర్ వెల్లడించాడు. బెడ్ రూమ్ తన భార్య కాళ్లు, చేతులు కట్టేసి, నోటిలో ఒక వస్త్రం కుక్కేసి, ఆమె గొంతును మరో వస్త్రంతో ఉరివేసి నట్లు చేసి ఆ తరువాత ఆమెతో ప్రయోగం చేశానని.. ఇదంతా తన భార్య అంగీకారంతోనే జరిగిందని.. కానీ ఊహించని విధంగా కార్యం మధ్యలో శశికళ ముక్కులో నుంచి రక్తం రావడంతో తాను వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లానని.. కానీ అక్కడ వైద్యులు శశికళ అప్పటికే మరణించిందని ధృవీకరించారు.


Also Read: పెళ్లిలో కాల్పులు.. కూతురు ఆ తప్పు చేసిందని కాల్చి చంపిన ఆర్మీ ఆఫీసర్..

అయితే భాస్కర్ చెప్పేది అంతా అబద్ధమని శశికళ తండ్రి అరుల్ ఆరోపించారు. తన కూతురు శశికళను భాస్కర్ తరుచూ కొట్టేవాడని, ఇంతకుముందు కూడా ఇలాగే కాళ్లు, చేతులు కట్టేసి నోటిలో వస్త్రం కుక్కి చితకబాదాడని.. అప్పుడు ఆస్పత్రిలో ఆమెకు వైద్యం చేయించామని తెలిపాడు. ఇదంతా కట్నం డబ్బుల కోసమే చేశాడని చెప్పారు. రూ.14 లక్షలు కట్నం అడిగితే తాను ఇవ్వలేకపోయానని అందుకే తన బిడ్డపై అక్రమ సంబంధం ఆరోపణాలు చేసి చిత్రహింసలు పెట్టేవాడని తెలిపారు. పోలీసుల విచారణలో శశికళ ఇంతకుముందు కూడా ఇలాగే ఆస్పత్రిలో గాయాల కారణంగా చికిత్స చేయించుకుందని తేలింది.

శశికళ బెంగళూరులో ఒక ప్లే స్కూల్, మహిళల కోసం ప్రత్యేక జిమ్ నడుపుతోంది. ఆమెకు భాస్కర్ వల్ల ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలు ఇప్పుడు అనాథలుగా మిగిలారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటు ఫారెన్సిక్ నివేదిక ఈ కేసులో కీలక పాత్ర పోషించనుంది. ఆ రిపోర్ట్ ల ఆధారంగానే విచారణ ముందుకుసాగుతుందని పోలీసులు తెలిపారు.

Related News

Road Accident: హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న బస్సు.. 11 మందికి తీవ్రగాయాలు..

Mulugu crime: భర్తను చంపేసిన భార్య.. ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచి మరీ నాటకం.. చివరకు!

Hyderabad crime: కూకట్‌పల్లిలో కలకలం.. పాపను చంపి పరారైన దుండగులు!

Warangal News: కేవలం అక్రమ సంబంధమే కాదు.. ప్రియుడితో భార్య ప్లాన్, కాకపోతే సీన్ రివర్స్

Guntur News: రాష్ట్రంలో దారుణ ఘటన.. పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి

Delhi News: దారుణం.. సొంత తల్లిపై అత్యాచారానికి పాల్పడిన కిరాతక కొడుకు.. చివరకు..?

Big Stories

×