Himachal Pradesh Tour: సమ్మర్ లో చాలా మంది వివిధ రకాల ప్రదేశాలకు వెళ్లడానికి టూర్ ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా మే , జూన్ నెలల్లో పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ సమ్మర్ లోనూ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది.
మీరు కూడా ఈ సమ్మర్ లో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. హిమాచల్ ప్రదేశ్ స్వర్గధామం. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడటానికి చాలా అందమైన ప్రదేశాలు కూడా ఉంటాయి. హిమచల్ ప్రదేశ్ టూర్ వెళ్తే మాత్రం ఇది మీ లైఫ్ లో మరచిపోలేని ట్రిప్ అవుతుంది.
షోజా గ్రామం:
షోజాను హిమాచల్ స్వర్గం అని పిలుస్తారు. ఇక్కడ చెక్క ఇళ్ళు, దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే షోజా గ్రామం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామాన్ని ప్రతి రోజూ వేల సంఖ్యలో పర్యటకులు చూడటానికి వస్తుంటారు.
ఈ గ్రామం చుట్టూ ఉన్న ప్రాంతాలు మీ మనసును దోచుకుంటాయి. మీరు ఈ ప్రదేశంలో ఒక భాగంగా మారి ఇక్కడే ఉండిపోవాలని కూడా అనుకుంటారు. ఈ ప్రాంతం అంత బాగుంటుంది.
షోజా గ్రామంలో మీరు మరెక్కడా కనిపించని నీలి గొర్రెలు, కస్తూరి జింకలు, మంచు చిరుతపులి వంటి అనేక జంతువులను చూస్తారు. ఈ గ్రామం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఉంటుంది. ఇక్కడ మీరు అనేక ప్రత్యేకమైన జంతువులను, అరుదైన చెట్లు, మొక్కలను చూడవచ్చు.
జలోరి పాస్.. షోజా గ్రామం నుండి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఏడాదంతా మంచు కురుస్తుంది. మీరు మంచు కురవడం చూడాలనుకుంటే ఈ ప్రదేశానికి తప్పకుండా వెళ్లండి. స్నోఫాల్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రదేశం డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య వరకు మూసివేస్తారు.
ఝలోరి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఒక సరస్సు ఉంటుంది. మీరు ఈ ప్రదేశానికి ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళవచ్చు. ఇది కూడా తప్పకుండా చూడాల్సిన ప్లేస్.
రఘుపూర్ కోట:
మీకు భారతీయ చరిత్రపై ఆసక్తి ఉంటే.. మీరు సెరోల్సర్ సరస్సు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రఘుపూర్ కోటను చూడటానికి వెళ్లండి. మండి పాలకులు నిర్మించిన ఈ కోట ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
మీరు సరస్సు నుండి కోట వైపు వెళ్ళినప్పుడు.. అడవి మార్గం ద్వారా మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ఈ అడవి చాలా అందంగా ఉంటుంది. ఇది మీ ప్రయాణాన్ని చిరస్మరణీయంగా చేస్తుంది.
జలపాతాలు:
వాటర్ ఫాల్ పాయింట్.. షోజా గ్రామం నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మీరు అక్కడికి చేరుకున్న వెంటనే మీరు స్వర్గంలో ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. ఇక్కడ చుట్టూ ఉన్న ప్రాంతం కూడా మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.
తీర్థన్ లోయ:
షోజా గ్రామం నుండి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీర్థన్ లోయ ట్రెక్కింగ్ కు చాలా ఫేమస్. ఇక్కడ మీరు రాపెల్లింగ్, రాక్ క్లైంబింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ నదులు, పర్వతాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం దాదాపు ఐదు లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
Also Read: బ్యాచిలర్స్ మాత్రమే కాదు.. గోవాకు ఫ్యామిలీతో వెళ్లి ఈ ప్రదేశాల్లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు
స్వర్గానికి మెట్ల మార్గం:
తీర్థన్ లోయ నుండి కొద్ది దూరంలో అనేక విచిత్రమైన గ్రామాలు ఉంటాయి. వీటిని చూడటం ద్వారా మీ ఆనందం రెట్టింపు అవుతుంది. షాంగఢ్ గ్రామంలోని గడ్డి భూములు, మహాభారత కాలం నాటివని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. దీనిని ఐదుగురు పాండవులు కలిసి ఈ గ్రామాలను నిర్మించారట. ఐదుగురు పాండవులు తమ రాజ్యాన్ని తమ కుమారుల కు అప్పగించి బయలుదేరినప్పుడు.. గడ్డి భూములను నిర్మించారట. ఇక్కడి ప్రజలు ఈ గడ్డి భూములను స్వర్గానికి నిచ్చెన అని కూడా పిలుస్తారు.