E-Paper
Advertisement

Municipal Elections: హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్‌ఎస్ నజర్.. పార్టీ కీలక నేతలతో మానిటరింగ్..!

Municipal Elections: హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్‌ఎస్ నజర్.. పార్టీ కీలక నేతలతో మానిటరింగ్..!
Advertisement

Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియపై బీఆర్‌ఎస్ అప్రమత్తమైంది. కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతుంది. అందుకు నేతలను సైతం అలర్టు చేసింది. ఎన్నికలు జరగనున్న కీలకమైన హంగ్ మున్సిపాలిటీల కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ఇన్-ఛార్జులను నియమించారు. ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్-ఛార్జిలతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సోమవారం సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బెదిరింపులు, పోలీసుల దుర్వినియోగం వంటి అంశాలను ఆరా తీశారు. పార్టీ స్థానిక నాయకత్వానికి అండగా ఉంటుందన్నారు.

8 మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్..

కాంగ్రెస్ అరాచకాల నేపథ్యంలో స్థానిక నాయకత్వానికి అన్ని విధాలా అండగా నిలబడేందుకు, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున సీనియర్ నాయకులను ప్రత్యేక ఇన్-ఛార్జిలుగా నియమించారు. 8 మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ స్పష్టంగా ఛైర్మన్ పీఠాలను గెలుచుకునే అవకాశం ఉన్నందున, మంగళవారం జరుగబోయే ఈ ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇన్ చార్జులను నియమించింది.

Advertisement

Also Read: ZPTC Elections: తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. జడ్పీటీసీ, ఎంపీటీసీల పై సీఎం రివ్యూ త్వరలో..?

కీలక నేతలు నియామకం

తోర్రూర్ మున్సిపాలిటీకి ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీమంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జనగామమున్సిపల్ కు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, క్యాతనపల్లి మున్సిపాలిటీకి ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఖానాపూర్ మున్సిపాలిటీకి ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఇంద్రేశం మున్సిపాలిటీకి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, కాగజ్ నగర్ మున్సిపాలిటీకి మాజీ మంత్రి జోగు రామన్న, జహీరాబాద్ మున్సిపాలిటీకి ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునితా లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ను నియామకం అయ్యారు. కేటీఆర్ ఆదేశాలతో ఆయా మున్సిపాలిటీలకు వెళ్లిచైర్మన్ పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఈ 8 మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని, కాంగ్రెస్ ఎన్ని కుతంత్రాలు చేసినా తమ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకోలేరని పార్టీ ధీమా వ్యక్తం చేసింది.

Advertisement

Also Read: Smartphone Comparison: ఓప్పో K14x 5G vs గెలాక్సీ F70e vs రియల్మీ P3 లైట్.. కొత్త ఫోన్లలో ఏది బెస్ట్?

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×