Chennai: వారిద్దరి భార్యాభర్తలు.. రెండేళ్ల కిందట వివాహం జరిగింది. భర్తకు ప్రభుత్వం ఉద్యోగం. భార్యకు ఈ మధ్యలో విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. భార్య ఇంట్లో లేదని రెచ్చిపోయాడు ఆమె భర్త. తన టాలెంట్ ఉపయోగించుకుని మహిళలతో రాసలీలలు చేయడం మొదలుపెట్టారు. సీసీటీవీ కెమెరా సాక్షిగా భర్త దొరికిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.
చెన్నైలో షాకింగ్ ఘటన.. భార్యకు విదేశాల్లో ఉద్యోగం.. మరో మహిళతో భర్త బిజీ
విదేశాల్లో పని చేస్తున్న ఓ మహిళ, తన భర్తపై చర్య తీసుకోవాలని కోరుతూ చెన్నై సిటీ పోలీసులను ఆశ్రయించింది. ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చి తన భర్త.. మరో మహిళతో ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. విచిత్రం ఏంటంటే మహిళ భర్త పోలీసు కానిస్టేబుల్.
తమిళనాడులోని కడలూర్‌కి చెందిన ఓ మహిళకు కానిస్టేబుల్ అరుళ్ ప్రసాద్‌తో 2024లో పెళ్లి జరిగింది. హాయిగా సంసారం సాగుతున్న సమయంలో సదరు మహిళకు ఉద్యోగం వచ్చింది. దుబాయ్‌లోని ఓ ప్రైవేటు బ్యాంకులో జాబ్ చేస్తోంది. ఆమె భర్త ప్రసాద్ చెన్నై వెస్ట్ మాంబలం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉన్నాడు.
ఇంట్లో కెమెరాలు పెట్టిన భార్య.. అడ్డంగా దొరికిపోయిన కానిస్టేబుల్ భర్త
ఈ గ్యాప్‌ని ప్రసాద్ ఎంజాయ్‌గా మలచుకునే ప్రయత్నం చేశాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సీన్ కట్ చేస్తే.. కొన్ని నెలల కిందట చెన్నై వచ్చింది సదరు మహిళ. తన భర్త గురించి ఇరుగు పొరుగు వారు చెప్పడంతో షాకైంది. ఆపై భర్తతో గొడవకు దిగింది. తాను బుద్దిమంతుడ్ని అని నమ్మించే ప్రయత్నం చేశాడు.
ఇక్కడే కానిస్టేబుల్ భార్య తెలివిగా వ్యవహరించింది. భర్త చెప్పింది నిజమేనని నమ్మి మళ్లీ దుబాయ్‌కి వెళ్లింది. వెళ్తూ వెళ్తూ భర్తకు తెలియకుండా ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వాటిని తన సెల్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకుంది. దుబాయ్ వెళ్లిన సదరు మహిళ.. భర్తకు తెలియకుండా చెన్నై వచ్చింది. హోటల్‌లో గది తీసుకుని ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించింది.
ALSO READ: లక్నో కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి!
శనివారం రాత్రి భర్త ప్రసాద్.. ఓ మహిళను ఇంటికి తీసుకొచ్చినట్లు అందులో కనిపించింది. అదే సమయంలో వెంటనే ఇంటికి భార్య వెళ్లడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయమై కానిస్టేబుల్ భార్య వళసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.