E-Paper
Advertisement

అమ్మతో బాండింగ్‌పై జేసన్ కామెంట్స్…కొడుకు కోసమైనా కలుస్తారా ?

అమ్మతో బాండింగ్‌పై జేసన్ కామెంట్స్…కొడుకు కోసమైనా కలుస్తారా ?
Advertisement

Jason Sanjay:హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ జేసన్ సంజయ్ కలిసి ‘సిగ్మా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసన్ తన తల్లి సంగీత గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

నేను ఎంత పెద్దవాడిని అయినా

Advertisement

ఇంటర్వ్యూలో సుమ.. జేసన్ చిన్నప్పటి ఫొటోలు, తన తల్లి సంగీతతో ఉన్న ఫొటోలను చూపించారు. తర్వాత అమ్మతో నీ బాండింగ్ ఎలా ఉంటుంది అని అడిగారు. దానికి జేసన్ “నేను ఎంత పెద్దవాడిని అయినా మా అమ్మకు నేను ఇంకా చిన్న పాపనే. అందరి అమ్మలకు కొడుకులు అలానే ఉంటారు. కానీ నా విషయంలో ఇంకొంచెం ఎక్కువ” అంటూ నవ్వుతూ చెప్పాడు.

అంతేకాదు ‘సిగ్మా’ సినిమా మొదలైన తర్వాత షూటింగ్, సినిమా పనులతో బిజీ అయిపోయి తన అమ్మతో ఎక్కువ సమయం గడపలేకపోయానని జేసన్ చెప్పాడు. సినిమా పూర్తయ్యాక తన తల్లితో కలిసి ‘సిగ్మా’ సినిమా చూడాలని ఉందని కూడా చెప్పాడు. ఈ మాటనే ఇప్పుడు చాలామందిని టచ్ చేసిందని చెప్పాలి.

Advertisement

దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు

ఇక తన అమ్మ గురించి చెబుతూ.. సంగీత ఏ విషయం అయినా దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుందని జేసన్ అన్నాడు. తనకు నచ్చినా నచ్చకపోయినా అమ్మ నిజం చెప్పేస్తుందని చెప్పుకొచ్చాడు. దీంతో “అమ్మ అంటే జేసన్‌కు ఎంత ఇష్టమో ఈ మాటల్లోనే తెలుస్తోంది” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే జేసన్ మాటలు మరోసారి విజయ్, సంగీత వ్యక్తిగత జీవితం గురించి చర్చకు దారితీశాయి. కొంతకాలంగా వీరిద్దరి వైవాహిక జీవితంపై రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో విజయ్ అభిమానులు, కోలీవుడ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇద్దరూ మళ్లీ కలిసిపోతారా?

అయితే తాజాగా ఈ కేసులో సంగీత వెనక్కి తగ్గారు. విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. “ఇద్దరూ మళ్లీ కలిసిపోతారా?” అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

కానీ అభిమానులు మాత్రం . “జేసన్ కోసమైనా విజయ్, సంగీత మళ్లీ కలిస్తే బాగుంటుంది” అని కామెంట్లు చేస్తున్నారు. “తల్లిదండ్రులు దూరంగా ఉంటే పిల్లలకు ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించలేం” అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.

విజయ్, సంగీత 1999 ఆగస్టు 25న పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు జేసన్ సంజయ్ కాగా, కూతురు దివ్య శాషా. ఇన్నేళ్ల తర్వాత వీరి వ్యక్తిగత జీవితం గురించి వార్తలు రావడంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు.

హీరోగా కాకుండా దర్శకుడిగా

ఇక జేసన్ విషయానికి వస్తే.. తండ్రి విజయ్‌లా హీరోగా కాకుండా దర్శకుడిగా తన కెరీర్ మొదలుపెట్టాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘సిగ్మా’ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. తండ్రి ఇమేజ్‌ను ఉపయోగించుకోకుండా తన సొంత టాలెంట్‌తో పేరు తెచ్చుకోవాలని జేసన్ ప్రయత్నిస్తున్నాడు.

గతంలో కూడా జేసన్ తన తండ్రి విజయ్ గురించి, తన తల్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. తన తండ్రి తనకు ఏదీ సులభంగా ఇచ్చేయకుండా.. తన కాళ్లపై తాను నిలబడేలా ప్రోత్సహించాడని చెప్పాడు. తన తల్లి మాత్రం తన జీవితంలో చాలా క్లోజ్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

ఏదైనా మంచి వార్త వస్తుందేమో

ప్రస్తుతం సోషల్ మీడియాలో జేసన్ మాటలే హాట్ టాపిక్‌గా మారాయి. ‘సిగ్మా’ సినిమా కంటే అతను అమ్మ గురించి మాట్లాడిన మాటలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు విజయ్-సంగీత విషయంలో కూడా ఏదైనా మంచి వార్త వస్తుందేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

also read:నయన్ పొగడ్తలు.. జనాల సెటైర్లు.. ఏ భాషలో సినిమా చేస్తే ఆ హీరోనే తోపా?

కానీ ఒక విషయం మాత్రం నిజం.. తల్లిదండ్రులు దూరంగా ఉంటే పిల్లలకు ఆ బాధ మామూలుగా ఉండదు. అందుకే జేసన్ కోసమైనా విజయ్, సంగీత మళ్లీ ఒక్కటైతే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.!

Tags

Related News

‘వారణాసి’ కథ ఇదేనా.. మహేష్ సినిమా స్టోరీ లీక్?

నయన్ పొగడ్తలు.. జనాల సెటైర్లు.. ఏ భాషలో సినిమా చేస్తే ఆ హీరోనే తోపా?

వరుణ్ తేజ్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చేశాయా?

సామ్ లైఫ్‌లో కొత్త చాప్టర్.. బేబీ కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్!

క్రేజీ లుక్ .. కిర్రాక్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న టాక్సిక్ బ్యూటీ!

‘టాక్సిక్’ ట్రైలర్.. నువ్వు జోకర్‌వి కాదు బాస్టర్డ్.. వామ్మో ఇంత వైల్డ్‌గా ఉందేంటి?

జైస్వాల్ తో డేటింగ్.. మృణాల్ రియాక్షన్ ఇదే!

Big Stories

Advertisement
×