E-Paper
Advertisement

‘వారణాసి’ కథ ఇదేనా.. మహేష్ సినిమా స్టోరీ లీక్?

‘వారణాసి’ కథ ఇదేనా.. మహేష్ సినిమా స్టోరీ లీక్?
Advertisement

Varanasi Story:వారణాసి.. ఈ సినిమా నుంచి జక్కన్న అప్డేట్స్ ఇవ్వడం లేట్ చేస్తున్నాడేమో కానీ.. “మేము ఆగలేం” అంటూ లీకు రాయుళ్లు మాత్రం వరుసగా లీకులు బయటకు వదులుతున్నారు. దీంతో సినిమా గురించి రోజుకో కొత్త విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి తాజాగా వారణాసి ఘాట్‌లో మహేష్ బాబు మునిగిపోతున్న విజువల్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఈ విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

Advertisement

ఇదిలా ఉంటే.. తాజాగా వారణాసి సినిమా కథ ఇదే అంటూ ఓ క్రేజీ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రపంచాన్ని ఢీకొట్టబోతున్న శాంభవి

ఈ వైరల్ అవుతున్న కథ ప్రకారం.. సినిమా ప్రస్తుత కాలంలో జరుగుతుందట. శాంభవి అనే భారీ గ్రహశకలం భూమివైపు దూసుకొస్తూ ఉంటుందట. అది వారణాసిని ఢీకొంటే కేవలం ఆ నగరానికే కాదు.. మొత్తం ప్రపంచానికే భారీ ప్రమాదం సంభవించే పరిస్థితి ఉంటుందట.

Advertisement

ఈ ప్రమాదాన్ని అడ్డుకునేందుకు రుద్ర రంగంలోకి దిగుతాడట. అయితే ఈ మిషన్‌లో రుద్ర ఒక్కడే ఉండడట. అతనికి తోడుగా మందాకిని అనే పాత్ర కూడా ప్రయాణిస్తుందని సమాచారం.

అసలు ఆ కళారూపం ఏంటి?

ఇక ఈ కథలో మరో ఆసక్తికరమైన అంశం ఉందట. ప్రపంచంలోని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన కళారూపాన్ని తీసుకురావాల్సిన బాధ్యత రుద్ర, మందాకినిలపై పడుతుందట.

అయితే ఆ కళారూపం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? దానికి వారణాసితో ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలే సినిమాలో కీలకంగా మారబోతున్నాయని టాక్.

ఇదే సమయంలో రుద్ర, మందాకినిలకు తెలియకుండా వారిని ఓ వ్యక్తి వెంబడిస్తుంటాడట. అతడే కుంభ. ఈ పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ కనిపించనున్న సంగతి తెలిసిందే.

హీరో వర్సెస్ విలన్

దీంతో ఒకవైపు ప్రపంచాన్ని కాపాడే మిషన్.. మరోవైపు హీరోను వెంటాడే విలన్.. మధ్యలో చరిత్ర, పురాణాలు, కళారూపాలు.. ఇలా అన్నింటినీ కలగలిపి జక్కన్న తనదైన స్టైల్‌లో ఓ భారీ అడ్వెంచరస్ వండర్‌ను తెరకెక్కిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ కథలో అందరినీ ఎక్కువగా ఆసక్తికి గురి చేస్తున్న అంశం మాత్రం రామాయణంతో ఉన్న లింక్.

రామాయణంలోనే సమస్యకు పరిష్కారం?

ఈ సమస్యకు మొత్తం రామాయణంలోనే పరిష్కారం ఉందనే పాయింట్ సినిమాలో కీలకంగా ఉంటుందట.అంటే.. ప్రస్తుత కాలంలో జరిగే ఓ సైన్స్ ఫిక్షన్ తరహా విపత్తును వేల ఏళ్ల నాటి రామాయణంతో లింక్ చేస్తూ కథను నడిపించబోతున్నారన్నమాట.

ఇదే నిజమైతే.. భారతీయ పురాణాలను, ఆధునిక సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌ను కలిపి రాజమౌళి ఎలాంటి కథను చెప్పబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

రుద్ర, కుంభ యాక్షన్‌కు గూస్‌బంప్స్?

మహేష్ బాబు గతంలో చేసిన యాక్షన్ సినిమాలతో పోలిస్తే వారణాసి పూర్తిగా వేరే లెవల్‌లో ఉండబోతుందని ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతోంది.

ముఖ్యంగా రుద్ర, కుంభ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటాయని టాక్.అంతేకాదు.. రాముడు, కుంభకర్ణుడి మధ్య జరిగే భీకర యుద్ధాన్ని కూడా ఈ కథలో జక్కన్న ప్లాన్ చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇండియా నుంచి అంటార్కిటికా.. అక్కడి నుంచి ఆఫ్రికా!

ఇక రుద్ర, మందాకిని ప్రయాణం కూడా మామూలుగా ఉండదట. ఇండియా నుంచి మొదలయ్యే ఈ అడ్వెంచర్.. అంటార్కిటికా మీదుగా ఆఫ్రికా వరకు సాగుతుందని సమాచారం.

అంటే సినిమాలో అనేక దేశాలు, ఖండాలను దాటే భారీ అడ్వెంచర్ సీన్స్ ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది.

ఇదంతా చూస్తుంటే జక్కన్న వారణాసిని కేవలం పాన్ ఇండియా సినిమాగా కాకుండా.. గ్లోబల్ అడ్వెంచర్‌గా చూపించే ప్లాన్‌లో ఉన్నాడని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథను బట్టి అర్థమవుతోంది.

అయితే ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు, లీకులే. ఇందులో నిజమెంత? కల్పితమెంత? అనేది సినిమా విడుదలయ్యే వరకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

ALSO READ:వరుణ్ తేజ్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చేశాయా?

 

Tags

Related News

అమ్మతో బాండింగ్‌పై జేసన్ కామెంట్స్…కొడుకు కోసమైనా కలుస్తారా ?

నయన్ పొగడ్తలు.. జనాల సెటైర్లు.. ఏ భాషలో సినిమా చేస్తే ఆ హీరోనే తోపా?

వరుణ్ తేజ్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చేశాయా?

సామ్ లైఫ్‌లో కొత్త చాప్టర్.. బేబీ కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్!

క్రేజీ లుక్ .. కిర్రాక్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న టాక్సిక్ బ్యూటీ!

‘టాక్సిక్’ ట్రైలర్.. నువ్వు జోకర్‌వి కాదు బాస్టర్డ్.. వామ్మో ఇంత వైల్డ్‌గా ఉందేంటి?

జైస్వాల్ తో డేటింగ్.. మృణాల్ రియాక్షన్ ఇదే!

Big Stories

Advertisement
×