BigTV English

UP Crime News: ఆ విషయంలో భర్తతో బార్య పేచీ.. మరిదితో ఎస్కేప్

UP Crime News: ఆ విషయంలో భర్తతో బార్య పేచీ.. మరిదితో ఎస్కేప్

UP Crime News: వింతలు, విశేషాలను కేరాఫ్‌గా మారింది ఉత్తర‌ప్రదేశ్. ఈ మధ్యకాలంలో వైరెటీ ఫ్యామిలీ కేసులు బయటపడుతున్నాయి. భార్యని కోరుకున్న ప్రియుడి ఇచ్చి భర్త పెళ్లి చేయడం, కాబోయే అల్లుడితో అత్త జెండా ఎత్తేయడం ఇంకా చాలానే ఉన్నాయనుకోండి. తాజాగా ఇప్పుడొక కేసు వెలుగులోకి వచ్చింది. విషయం ఏంటంటే కేవలం భర్త పెంచుకున్న పొడవాటి గడ్డం అందుకు కారణమైంది. చివరకు మరిదితో కలిసి పారిపోయింది. సంచలనం రేపిన ఈ ఘటన మీరట్‌లో వెలుగుచూసింది.


మ్యారేజ్ గురించి చెప్పనక్కర్లేదు. యువకులు నీటుగా తయారు అయ్యేవారు. పెళ్లికి ముందు నుంచే ముస్తాబు అయ్యేవారు. అదంతా గతం. ప్రస్తుతం ట్రెండ్ మారింది. హెయిర్ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. లైట్‌గా గడ్డం పెంచుతూ పెళ్లి పీఠలపై కనిపిస్తున్నారు నేటి యువకులు. అలా కనిపించకపోతే పెళ్లి కొడుకు అప్‌డేట్ పర్సన్ కాదని సెటైర్లు వేసినవాళ్లు లేకపోలేదు. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం.

అసలేం జరిగింది?


యూపీలోని మీరట్‌ సిటీలో ఉజ్జ్వాల్ గార్డెన్ కాలనీలో ఉంటున్నాడు మౌలానా షకీర్‌ ఫ్యామిలీ. కుటుంబసభ్యుల ఒత్తిడితో ఏడు నెలల కిందట అర్షి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. యువతి ఇంటర్ పూర్తి చేసింది. ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. షకీర్ మాంచి అందగాడు కూడా. కాకపోతే గడ్డం కాస్త అతడి లుక్‌ని డ్యామేజ్ చేసిందన్నది ఆమె భార్య ప్రధాన ఆరోపణ.

పెళ్లయిన తొలిరాత్రి గడ్డంపై అభ్యంతరం వ్యక్తం చేసిందట భార్య. తొలుత ఈ విషయాన్ని లైట్‌గా తీసుకున్నాడు షకీర్. భార్య అలా అనడం సహజమేనని భావించాడు. షకీర్ పని నిమిత్త బయటకు వెళ్లేవాడు. ఇంట్లో షకీర్ తల్లి,  తమ్ముడు  ఉండేవాడు. షకీర్ తమ్మడు మాత్రం ట్రెండ్ తగ్గట్టుగా ఉంటాడు. స్లిమ్‌గా న్యూలుక్‌తో ఉంటాడు.

ALSO READ: బోర్డుతో లక్షన్నర లూటీ, ఎలాగ సాధ్యం

అత్తింటివారు ఏమన్నారు?

ఆర్తికి మరిది బాగా నచ్చేశాడు. మరిదితో కాస్త చనువుగా ఉండడం మొదలైంది. ఆ తర్వాత ప్రేమగా మారింది. గడిచిన ఏడునెలలుగా తాను చెప్పినా భర్త గడ్డం తీయలేదని భావించిన ఆర్తి, మరిదితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. బయట నుంచి ఇంటికి వచ్చిన షకీర్‌కు తల్లి తప్పితే ఇంట్లో ఎవరూ కనిపించలేదు. చివరకు తల్లిని అడిగాడు. తనకు కనిపించలేదని చెప్పడంతో వెతికాడు. ఆ తర్వాత షకీర్‌కు బుర్ర పని చేసింది.

గడ్డం తీయలేదన్న కారణంతో భార్య వెళ్లిపోయిందని భావించాడు. షకీర్‌కు తమ్ముడు కూడా కనిపించలేదు. తొలుత ఆర్తి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు షకీర్. ఆమెతో మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పేశారు. దీంతో ఏం చెయ్యాలో తెలియక ఇబ్బందిపడిన షకీర్, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు వ్యక్తులు తప్పిపోయినట్లుగా కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని మేరఠ్ పోలీసు అధికారులు వెల్లడించాడు. మ్యారేజ్ అయిన రోజు నుంచి గడ్డంపై అర్షి అభ్యంతరం తెలిపిందని ఫిర్యాదు ప్రస్తావించాడు. ఈ విషయమై భార్యతో చాలాసార్లు గొడవకు దిగిందని ప్రస్తావించాడు. మొత్తానికి భార్య ఏమోగానీ, తమ్ముడు మాత్రం అన్నకాపురంలో నిప్పులు పోశాడని అంటున్నారు.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×