Cyber Crime : సైబర్ నేరగాళ్లు చాలా సింపుల్‌గా డబ్బులు కాజేస్తుంటారు. ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయమంటారు. ఓటీపీ చెప్పమంటారు. పార్సిల్ వచ్చిందంటారు. ట్రేడింగ్ చేస్తే డబ్బులే డబ్బులని ఆశ చూపిస్తారు. బర్త్ డే విషెష్ చెబుతూ లింకులు పంపిస్తుంటారు. డిస్కౌంట్ కూపన్ పేరుతో ఏపీకే ఫైల్స్ సెండ్ చేస్తారు. ఆ మెసేజ్‌లను కానీ, లింకులను కానీ ఓపెన్ చేస్తే అంతే ఇక. ఓటీపీ కనుక చెప్పేశామంటే తడిగుడ్డే . వాళ్ల ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేశామంటే ఖేల్ ఖతం. మన అకౌంట్ ఖాళీ. డబ్బులన్నీ ఫసక్. బెట్టింగ్ యాప్స్ మోసాలు మరో లెక్క. అందుకే, ఇలాంటి సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం మొబైల్ కాలర్ ట్యూన్స్‌తో జనాలను అలర్ట్ చేస్తోంది. అయితే, మనం ఎప్పుడైనా ఆ హలో ట్యూన్‌ను ఎప్పుడైనా కంప్లీట్‌గా వింటేగా? కట్ చేసి మళ్లీ కాల్ చేస్తుంటాం. అట్లుంటది మనతోని. అందుకే, సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం అంటూ లేదు.
క్రియేటివ్ ఐడియాలు.. ఫుల్‌గా సైబర్ మోసాలు
చాలా ఈజీగా బుట్టలో పడేస్తుంటారు. తెలివైన వాళ్లు కూడా సులువుగా వాళ్ల గాలానికి చిక్కుతున్నారు. అయితే, ప్రజల్లో అవేర్‌నెస్ పెరుగుతుండటంతో కేటుగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలతో మోసాలకు దిగుతున్నారు. ఓటీపీ చెప్పమంటే చెప్పే రోజులు కావివి. ఆ ఐడియా అవుట్‌డేటెడ్. ఇప్పుడు వర్కవుట్ కాదు. అందుకే, మీకో కొరియర్ వచ్చింది.. అందులో డ్రగ్స్ ఉన్నాయంటూ సైబర్ అరెస్ట్ స్ట్రాటజీలు అమలు చేస్తున్నారు. అక్కడితో ఆగిపోవట్లేదు సైబర్ క్రిమినల్స్. రోజుకో కొత్త రకం మోసాలతో కొల్లగొడుతున్నారు. అలాంటిదే ఓ వెరైటీ ఛీటింగ్ సికింద్రాబాద్‌లో జరిగింది.
ఆన్‌లైన్లో TO LET.. ఫసక్
సికింద్రాబాద్‌కు చెందిన ఓ మహిళ తన ఇంటికి TO LET బోర్డు పెట్టింది. ఆన్‌లైన్లో పెడితే ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుందని.. ఆ పని కూడా చేసింది. అంతే. సైబర్ నేరగాళ్లు లైన్‌లోకి వచ్చారు. ఆన్‌లైన్‌లో.. ఇల్లు అద్దెకు ఇవ్వబడును అనే పోస్ట్ చూసి.. అందులో ఉన్న ఫోన్ నెంబర్‌కు కాల్ చేశారు. క్రిమినల్స్ ఎంత పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేశారంటే.. సికింద్రాబాద్ ఏరియాలో టు లెట్ బోర్డు ఉంది కాబట్టి.. ఆ ప్రాంతంలో ఆర్మీ వాళ్లు ఉంటారని తెలుసుకుని.. ఆ యాంగిల్‌లో బురిడీ కొట్టించారు. తాను ఆర్మీ అధికారినంటూ, తనకు ఇల్లు అద్దెకు కావాలంటూ మాటలు కలిపాడు. మంచి రెంట్ ఇస్తానంటూ అదిరిపోయే అమౌంట్ కూడా చెప్పాడు ఆ ఆర్మీ అధికారినని చెప్పిన సైబర్ క్రిమినల్. అతను ఇస్తానన్న రెంట్ చూసి ఆ ఇంటి ఓనర్ తెగ ఖుషీ అయింది. ఇదేదో మంచి బేరం అనుకుని వెంటనే ఒప్పేసుకుంది. అక్కడే.. ఆ కేటుగాడు అసలు ట్రాప్ స్టార్ట్ చేశాడు.
లక్షన్నర పాయే..
ఆర్మీ వాళ్ల చెల్లింపులు రివర్స్ మోడ్‌లో ఉంటాయంటూ కాకమ్మ కథ చెప్పాడు. ముందుగా మీరే మాకు అమౌంట్ పంపాల్సి ఉంటుంది.. ఆ తర్వాత అదే మొత్తాన్ని తాను రివర్స్ చెల్లిస్తానంటూ చాలా నమ్మకంగా నమ్మించాడు. ఆ ఇంటి ఓనర్ నిజమే కాబోలు అనుకుంది. అతని మాటలు నమ్మి.. అతను చెప్పిన బ్యాంక్ అకౌంట్‌కు రూ. లక్షా 31 వేలు ట్రాన్స్‌ఫర్ చేసిందా మహిళ. డబ్బులు పంపాక.. కన్ఫర్మేషన్ కోసం ఆ ఆర్మీ ఆఫీసర్‌కు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఎన్నిసార్లు ట్రై చేసినా కాల్ కనెక్ట్ కాలేదు. చివరాఖరికి తాను మోసపోయానని లేట్‌గా తెలుసుకుంది. సీసీఎస్‌లో కంప్లైంట్ చేసింది. ఇదంతా సైబర్ నేరగాళ్ల పని అని పోలీసులు చెప్పడంతో అవాక్కైంది ఆ ఇంటి ఓనర్. ఇలా కూడా ఛీటింగ్ చేస్తారా? అని వాపోయింది. ఆన్‌లైన్‌లో TO LET అని పెట్టిన పాపానికి.. లక్షన్నర పాయే అని బాధపడింది.