Rithu Chowdary:రీతూ చౌదరి (Rithu Chowdary).. బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులలో కాస్త గుర్తింపు సొంతం చేసుకున్న ఈమె.. సీరియల్ నటిగా కెరియర్ ను ప్రారంభించి, ఆ తర్వాత నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘ఇంటిగుట్టు’ సీరియల్ తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఈమె, ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగుపెట్టి అక్కడ కూడా మరింత ఫేమ్ సొంతం చేసుకుంది. ఇకపోతే జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ఈమె, ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనీ లాండరింగ్ కేసుతో పాటు బెట్టింగ్ ప్రమోట్ చేసి ఇబ్బందుల్లో పడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాగా వైరల్ అయిన రీతూ చౌదరి అందులో భాగంగానే ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత జీవిత విషయానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటోంది.
వరుస ఇంటర్వ్యూలతో బిజీగా మారిన రీతూ చౌదరి..
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతూ చౌదరి తన పెళ్లి గురించి చేసిన కామెంట్లపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తనకు పెళ్లయి విడిపోయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రీతూ చౌదరి ఇలా కామెంట్ చేశారు. 2022లో రీతూ చౌదరి తన ఇన్స్టాగ్రామ్ లో శ్రీకాంత్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్లు పోస్ట్ పెట్టింది. అదే సమయంలో అతడిని పెళ్లి చేసుకున్నట్లుగా కూడా కొన్ని ఫోటోలు ఆమె షేర్ చేసింది. దీనితో సోషల్ మీడియాలో ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పటికి కూడా ఆ ఫోటోలు సోషల్ మీడియా లో దర్శనమిస్తూనే ఉంటాయి. కానీ రీతూ చౌదరి మాత్రం తన పెళ్లిపై అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆ ఫోటోలతో రీతు చౌదరి రహస్యంగా పెళ్లి చేసుకుంది అంటూ వార్తలు రావడం గమనార్హం. ఇలా రోజుకీ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో సడన్గా తనకు పెళ్లి కాలేదని చెప్పి హాట్ బాంబ్ పేల్చింది.
నాకసలు పెళ్లే కాలేదు – రీతు చౌదరి..
రీతూ చౌదరి మాట్లాడుతూ.. “నాకసలు పెళ్లే కాలేదు. అతడితో కేవలం 6 నెలలు మాత్రమే నేను కలిసి ఉన్నాను. ఇక నా పెళ్లికి సంబంధించిన ఫోటోలు అంటారా అవన్నీ అవాస్తవాలే” అంటూ ఒక్కసారిగా కొట్టి పారేసింది. ఇకపోతే ఇన్ని రోజులు పెళ్లి చేసుకుందని వార్తలు రావడంతో రీతు చౌదరి ఒక్కసారిగా ఆ వార్తలకు పులిస్టాప్ పెట్టిందని చెప్పవచ్చు. అయితే ఈ విషయాలు విన్న కొంతమంది మాత్రం.. ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కోవడంతో దాని నుండి బయటపడడానికి ఇప్పుడు ఇలాంటి కామెంట్లు చేస్తోందని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రీతు చౌదరి చెప్పిన కామెంట్లను బట్టి చూస్తే ఈమె పెళ్లి చేసుకోలేదు అని స్పష్టం అవుతుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈమె గ్లామర్ షో చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ స్కిన్ షో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు వెకేషన్ కి వెళ్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.