BigTV English

Woman death kiss coworker: తోటి ఉద్యోగి కిస్ చేయలేదని హత్య.. డాక్టర్‌ను 7 సార్లు కత్తితో పొడిచిన పేషెంట్

Woman death kiss coworker: తోటి ఉద్యోగి కిస్ చేయలేదని హత్య.. డాక్టర్‌ను 7 సార్లు కత్తితో పొడిచిన పేషెంట్

Woman death kiss coworker| ఉద్యోగం చేసే మహిళలకు ఇండియాలోనే కాదు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా భద్రత లేదని తాజాగా జరిగిన ఘటన ద్వారా తెలుస్తోంది. తన తోటి మహిళా ఉద్యోగి ముద్దు పెట్టడానికి నిరాకరించిందని ఒక యువకుడు ఉన్మాదిగా మారాడు. ఆమెపై దాడి చేసి క్రూరంగా హత్య చేశాడు. వారం రోజుల క్రితమే ఆ మహిళకు వివాహం జరగింది. ఈ ఘటన బ్రెజిల్ దేశంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. 38 ఏళ్ల సింతియా బార్బోసా అనే మహిళ ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం చేస్తోంది. ఆమె 8 రోజుల క్రితమే రెండో వివాహం చేసుకుంది. ఆమెకు మొదటి భర్తతో నలుగురు పిల్లులున్నారు. అయితే ఇటీవల ఆమె ఒక ఇంట్లో కేర్ గివర్ గా ఉద్యోగం చేస్తోంది. ఆమెతోపాటు మార్సెలో శాంటోస్ అనే 30 ఏళ్ల యువకుడు కూడా అదే ఇంట్లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నవంబర్ 3వ తేదీ ఇంటి నుంచి డ్యూటీ కోసం బయలుదేరిన సింతియా బార్బోసా తిరిగిరాలేదు. దీంతో పోలీసులకు ఆమె భర్త ఫిర్యాదు చేశారు.

పోలీసులు సింతియా మిస్సింగ్ కేసులో విచారణ చేపట్టారు. అయితే సింతియాతో కలిసి పనిచేసే మార్సెలో శాంటోస్ పక్క ఇంట్లోకి వెళ్లి గడ్డపార (షోవెల్ – గుంతులు తోంగేందుకు ఉపయోగించే పరికరం) కోసం అడిగాడని పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు మార్సెలోపై అనుమానంతో నవంబర్ 5వ తేదీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించారు. అప్పుడు మార్సెలో తాను క్షణికావేశంలో ఆమెను హత్య చేశానని అంగీకరించాడు.


Also Read: 29 మంది పిల్లలకు ఉరిశిక్ష!.. జైల్లో ఆహారం ఇవ్వకుండా వేధింపులు..

పోలీసుల కథనం ప్రకారం.. నవంబర్ 3వ తేదీ పనికోసం వెళ్లిన సింతియా ఒంటరిగా ఉండడం చూసి.. మార్సెలో ఆమెను గట్టిగా పట్టుకొని ముద్దుపెట్టుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆమె వెంటనే అతని చెంప చెల్లుమనిపించింది. తనకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. సింతియా కొట్టిన చెంపదెబ్బకు తన పురుషాహంకారం, ఆవేశం తోడై.. మార్సెలో సింతియాపై దాడి చేశాడు. ఆమెను వెనుక నుంచి గట్టిగా పట్టుకొని ఊపరిఆడకుండా చేశాడు. దీంతో సింతియా స్పృహతప్పిపడిపోయింది. అది గమనించిన మార్సెలో వెంటనే ఆమె శవాన్ని పక్కనే నిర్మానుషంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి పాతిపెట్టాలని ప్లాన్ వేశాడు. కానీ ఇంట్లో సమాధి తవ్వడానికి గడ్డపార లేదు. అందుకోసం పక్కింటికి వెళ్లి తనకు గడ్డపార కావాలని అడిగాడు. కానీ పక్కింట్లో లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చి చూస్తే.. సింతియా ఇంకా బతికే ఉంది.

ఆమె మెల్లగా లేచి పారిపోవాలని ప్రయత్నింస్తుండగా.. ఆమె తలపై గట్టిగా కొట్టి. మళ్లీ ఆమె ఊపిరి ఆడకుండా ఒడిపిపట్టుకున్నాడు. దీంతో సింతియా చనిపోయింది. ఆ తరువాత అదే వీధిలో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలోకి తీసుకెళ్లి శవాన్ని దాచిపెట్టాడు. పోలీసులు మార్సెలోని విచారణ చేసి.. సింతియా మృతదేహాన్ని వెలికితీశారు. సింతియా చనిపోవడంతో ఆమె భర్త నథానెల్ డిసిల్వా కన్నీరు మున్నీరయ్యాడు. తన జీవితంలో ఆమె తప్ప మరెవరూ లేరని మీడియా ముందు ఏడ్చాడు.

Also Read: భార్యాబాధితుడు.. పిల్లలతో సహా ఆత్మహత్య.. ఏడుస్తూ వీడియో

మరోవైపు భారతదేశంలోని చెన్నై నగరంలో కూడా ఇలాంటి హింసాత్మక ఘటన జరిగింది. చెన్నైలోని ఒక ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే డాక్టర్ ని బుధవారం నవంబర్ 13న ఒక యువకుడు ఒక చిన్న కత్తితో 7 సార్లు పొడిచాడు. డాక్టర్ ఛాతి భాగంలో గాయాలు కావడంతో అక్కడ సెక్యూరిటి సిబ్బంది వెంటనే దాడి చేసిన యువకుడిని పట్టుకొని.. డాక్టర్ ని ఐసియులోకి తీసుకెళ్లారు. గుండె, క్యాన్సర్ నిపుణుడైన ఆ డాక్టర్ తన తల్లికి  తప్పుడు మందులు రాసిచ్చాడని దాడి చేసిన యువకుడు తెలిపాడు. ప్రస్తుతం డాక్టర్ ఐసియులో చికిత్స పొందుతుండగా.. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×