BigTV English

Cruel Wife : భార్యాబాధితుడు.. పిల్లలతో సహా ఆత్మహత్య.. ఏడుస్తూ వీడియో

Cruel Wife : భార్యాబాధితుడు.. పిల్లలతో సహా ఆత్మహత్య.. ఏడుస్తూ వీడియో

Cruel Wife | జీవితంలో అందరికీ కష్టాలుంటాయి. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ కొందరు ఆ కష్టాల నుంచి తప్పించుకోవడానికి స్వార్థ పూరితంగా ఆలోచిస్తారు. మానవీయ సంబంధాలు, బాధ్యతలను మరిచి తమ సంతోషం మాత్రమే ముఖ్యమని భావిస్తారు. ఈ కారణంగా కుటుంబాలు నాశనమవుతాయి. తాజాగా అలాంటి ఒక ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక యువకుడు తన ఇద్దరు చిన్న పిల్లలకు విషమిచ్చి తాను కూడా చనిపోయాడు. కానీ ఈ విషాద ఘటనకు ముందు ఆ యువకుడు తన ఆత్మహత్యకు కారణం తన భార్యేనని చెబుతూ ఏడుస్తూ వీడియో పెట్టాడు.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ నగరానికి చెందిన పునీత్ అనే యువకుడు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో అతను చనిపోయే కొన్ని నిమిషాల ముందు రికార్డ్ చేశాడు. వీడియో పెట్టాక తన ఇద్దరు పిల్లలతో సహా విషం తిని ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అతడి ఆచూకీ తెలుసుకొని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పునీత్, అతని కూతురు చనిపోగా.. అతని రెండేళ్ల కొడుకు చికిత్స పొందుతూ చనిపోయాడు.

Also Read: స్కృడ్రైవర్‌తో పొడిచి పొడిచి హత్య.. భర్తను వదిలి బాయ్‌ఫ్రెండ్‌తో 4 పిల్లల తల్లి సహజీవనం


పునీత్ పోస్ట్ చేసిన వీడియోలో ఏముంది?
పునీత్ నాలుగేళ్ల క్రితం కుమారి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. పునీత్ ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. పునీత్, కుమారికి నాలుగేళ్లలో ఇద్దరు పిల్లలు పుట్టారు. పునీత్ తల్లి కూడా అదే ఇంట్లో ఉంటోంది. అయితే కుమారికి మాత్రం ఇంట్లో పనిచేయడం ఇష్టం ఉండదు. ఆమె పిల్లలను కూడా పట్టించుకోదు. తరుచూ షాపింగ్లకు, షికార్లకు తిరుగుతూ ఉండడం ఆమెకు ఇష్టం. పిల్లల పాలన అంతా పునీత్ తల్లినే చూస్తూ ఉంటుంది. అయితే కొంతకాలంగా పునీత్ తల్లికి అనారోగ్యం చేసింది. దీంతో ఆమె పిల్లల పోషణ భారం చూసుకోలేకపోయింది.

ఇదంతా ఇంతకాలం భరించిన పునీత్ తన భార్యను మందలించాడు. ఇక ఇంట్లో కుదురుగా ఉండాలని చెప్పాడు. కానీ కుమారి భర్తతో గొడవకు దిగింది. తనకు కోట్లు సంపాదించే భర్త కావాలి.. ఇంట్లో పనిమనుషులు కావాలి.. ఈ సుఖాలు లేకపోతే తాను కాపురం చేయనని చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. వారం రోజుల క్రితం.. కుమారి, పునీత్ మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఉద్రేక మనస్తత్వం ఉన్న కుమారి తన చేయి కోసుకొని.. భర్తను భయపెట్టింది. తనను భర్త హింసిస్తున్నట్లు పోలీస్ స్టేషన్ క వెళ్లి కేసు పెడతానని బెదిరించింది. ఇక తన వల్ల కాదు అని తాను కోరుకుంటున్న విలాసవంతమైన జీవితం ఇంట్లో లేదు గనుక తనకు విడాకులు కావాలని చెప్పేసి.. తన పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలను కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయింది.

ఇద్దరూ చిన్నపిల్లలే.. పాపకు మూడు సంవత్సరాలు. బాబుకు 18 నెలలు. కుమారి వెళ్లిపోవడంతో ఆ చిన్నపిల్లల భారం కూడా పునీత్, అతని తల్లిపై పడింది. కానీ మూడు రోజుల క్రితం పునీత్ తల్లి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరింది. దీంతో పిల్లలను చూసుకోవడం పునీత్ కు కష్టంగా మారింది. పైగా అతనికి ఆఫీసులో ఉద్యోగ సమస్యలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పునీత్, తన పిల్లలను తీసుకొని ఒక కారులో తన భార్య పుట్టింటికి వెళ్లాడు. ఇక గొడవ చేసింది.. చాలు తిరిగి రావాలని కోరాడు. కానీ కుమారి అందుకు ఒప్పుకోలేదు. పోనీ తన తల్లి ఆరోగ్యం కుదుటపడేవరకు పిల్లలను చూసుకోవాలని అడిగాడు. ఇకపై ఆ పిల్లలకు తనకు ఏ సంబంధం లేదని కుమారి కర్కశంగా చెప్పింది. పునీత్ ఆమెను ఎంత ప్రాధేమపడినా.. కుమారి మనసు మాత్రం మారలేదు. దీంతో అక్కడి నుంచి పునీత్ తిరిగి పిల్లలను తీసుకొని బయలుదేరాడు.

దారిలో తన భార్య మాటలు గుర్తు చేసుకుంటూ మనస్తాపం చెంది.. ఆత్మహత్య చేసుకునేందుకు విషం తెచ్చుకున్నాడు. తాను చనిపోతే పిల్లల గతి ఏమవుతుందోనని భావించి.. పిల్లలకు కూడా విషమిచ్చి తాను ఆ విషం తిన్నాడు. చనిపోయే కొన్ని క్షణాల ముందు తన భార్య గురించి వీడియోలో తెలిపి.. ఆమెను ఉరి తీయాలని పోలీసులకు కోరుతూ చనిపోయాడు.

పునీత్ ఆత్మ హత్య కేసులో పోలీసులు కుమారిపై ఆత్మ హత్య చేసుకునేందుకు వేధించినందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×